నాందిలో న్యూడ్ సీన్ అందుకే చేసాం: డైరెక్టర్ విజయ్

Tue Feb 23 2021 23:00:02 GMT+0530 (IST)

That's why we did the nude scene in Naandhi

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్.. చాలా ఏళ్ల తర్వాత నాంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం నరేష్ నాంది సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. 2012 సుడిగాడు సినిమా తర్వాత నరేష్ ఖాతాలో సరైన సక్సెస్ పడలేదు. అన్ని వచ్చిపోయే సినిమాలే గాని ఇలా చెప్పుకోదగ్గదిగా ఏది నిలవలేదు.నరేష్ కామెడీ పంథా పక్కన పెట్టిన ప్రతిసారి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే కెరీర్ ప్రారంభంలో నేను సినిమాతో హిట్ అందుకున్న నరేష్.. ఆ తర్వాత గమ్యం సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఎంత సీరియస్ యాక్టింగ్ తో మెప్పించగలడో.. ఆ తర్వాత శంభోశివశంభో సినిమాలో కూడా మరో మంచి పాత్రచేసి సక్సెస్ అయ్యాడు. నరేష్ కామెడీ సినిమాలు చేసినా రాని క్రేజ్ డిఫరెంట్ ఇలా డిఫరెంట్ సినిమా చేసిన ప్రతిసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

అయితే చాలకాలం తర్వాత నరేష్ మళ్లీ నాంది అనే ఎమోషనల్ సోషల్ మూవీ చేసాడు. బిగ్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ సినిమాలో నరేష్ యాక్టింగ్ ఓ రేంజిలో ఆకట్టుకుంటుందని ప్రేక్షకులు చెబుతున్నారు. అలాగే క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూ ఇవ్వడం జరిగింది. అయితే నాందిలో నరేష్ జైలులో బట్టలు లేకుండా నటించిన సీన్ గురించి డైరెక్టర్ విజయ్ కనకమేడల చెప్పుకొచ్చాడు. అసలు న్యూడ్ సీన్ బ్లర్ చేసారనే టాక్ వచ్చింది.

అలాగే హీరోను ఎలా ఒప్పించారు? అనేదానికి విజయ్ మాట్లాడుతూ.. "ఫస్ట్ కథ చెప్పినప్పుడు షర్ట్ విప్పేస్తే సరిపోతుందని సీన్ గురించి చెప్పాము. కానీ సీన్ చేసే సమయంలో రియాలిటీగా ఉంటేనే బాగుంటుందని చెప్పాము. అయితే ప్యాంట్ విప్పేస్తే సరిపోతుందా అని నరేష్ అన్నారు. కానీ నేను మళ్లీ అలా చూడగానే.. అండర్ వేర్ కూడా తీసేయ్యలా అని నరేష్ అన్నారు. నేను అవునన్నాను. బ్లర్ చేద్దామని అనుకున్నాం కానీ రియాలిటీగా ఉండదని మళ్లీ అలా చేసాం" అంటూ విజయ్ చెప్పాడు.