Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో అంటే ఆ మాత్రం ఉంటది

By:  Tupaki Desk   |   21 April 2021 3:32 AM GMT
ఎన్టీఆర్ తో అంటే ఆ మాత్రం ఉంటది
X
డైరక్టర్స్ అంతా స్టార్స్ తో సినిమా చేయటానికి ఉత్సాహం చూపిస్తూంటారు. అందుకు కారణం స్టార్స్ తో సినిమా చేస్తే ఫేమ్ కు ఫేమ్, డబ్బుకు డబ్బు అడక్కుండానే వచ్చి పడతాయి. ప్రమోషన్స్ వాటంతట అవే జరిగిపోతాయి. సినిమా ప్రారంభమైన నాటి నుంచి మీడియా, ఫ్యాన్స్ ఆ సినిమాని మోసుకుపోతారు. స్టార్ తో చేసే డైరక్టర్ అంటే ప్రత్యేకమైన గుర్తింపు, ఇంటర్వూలు హంగమా. మిగతా స్టార్స్ ..మాతో ఎప్పుడు చేస్తావంటూ మెసేజ్ లు పెడుతూంటారు. స్టార్ తో సినిమా కొత్త డైరక్టర్ కు పెద్ద ప్రమోషన్ వచ్చినట్లే. ఇప్పుడు బుచ్చిబాబు పరిస్దితి అదే. ఎన్టీఆర్ తో ఆయన తదుపరి సినిమా చెయ్యబోతున్నారు.

రీసెంట్ గా ఉప్పెన సినిమాతో డైరక్టర్ గా బుచ్చిబాబు పరిచయమైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఉప్పెన స్దాయి కలెక్షన్స్ కురిపించింది. నిర్మాతలకు నమ్మలేని స్దాయి లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో తెలుగు పరిశ్రమ మొత్తం ఎవరా దర్శకుడు అంటూ బుచ్చిబాబు వైపు ఒక్కసారి తిరిగిచూసింది. అనేక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు, బడా స్టార్ హీరోలు బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మించబోయో ప్రాజెక్ట్‌కే మళ్ళీ బుచ్చి బాబు కమిటయ్యాడు. బుచ్చిబాబు రెండవ సినిమా కూడా ఈ మేకర్స్‌తోనే చేయబోతున్నాడు.

బుచ్చిబాబు నెక్ట్స్ సినిమాలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే బుచ్చిబాబు ఈ స్టోరీ లైన్ ఎన్టీఆర్‌కి చెప్పాడని... వెంటనే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. ఈ క్రమంలో బుచ్చిబాబుకు ఎనిమిది కోట్లు రెమ్యునేషన్ ఇవ్వటానికి ముందుకొచ్చింది. జీఎస్టీ రెండు కోట్లుతో కలిసి మొత్తం పదికోట్లు అంటున్నారు. రెండో సినిమాకే అంత ఇస్తున్నారా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఎన్టీఆర్ తో సినిమా అంటే ఆ మాత్రం ఉంటుందనేది ఫిల్మ్ నగర్ వర్గాల ఉవాచ. బుచ్చిబాబు ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ఫైనల్ స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నాడట. మరో ప్రక్క ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.