Begin typing your search above and press return to search.

ఆ స్పెషల్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ మన మహేష్‌ ఫ్యాన్‌

By:  Tupaki Desk   |   8 Jun 2021 12:30 PM GMT
ఆ స్పెషల్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ మన మహేష్‌ ఫ్యాన్‌
X
టాలీవుడ్ స్టార్ హీరోలకు బాలీవుడ్‌ సెలబ్రెటీ ఫ్యాన్స్ చాలా మందే ఉంటారు. మహేష్ బాబు అంటే ఇష్టమంటూ చాలా మంది ఉత్తరాది ముద్దుగుమ్మలు చెప్పిన సందర్బాలు ఉన్నాయి. సౌత్‌ స్టార్స్ కు చాలా మంది నార్త్‌ లో అభిమానులు ఉండటం ఈమద్య మరీ కామన్ అయ్యింది. గుజరాత్‌ కు చెందిన ఒక యువ ఐపీఎస్ ఆఫీసర్‌ కు మహేష్‌ బాబు అంటే ప్రత్యేకమైన అభిమానమట. మహేష్‌ బాబు సినిమాలు చూసింది తక్కువే అయినా కూడా ఆయన చేసిన కార్యక్రమాల వల్ల తాను అభిమానిగా మారానంటూ ఆ ఐపీఎస్ ఆఫీసర్ పేర్కొన్నారు.

గుజరాత్‌ లోని ఒక మారు మూల పల్లెకు చెందిన సఫిన్ హసన్ 22 ఏళ్ల వయసులోనే ఐపీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. దేశంలోనే అతి చిన్న ఐపీఎస్ గా నిలిచిన సఫిన్‌ ఇటీవల ఇన్‌ స్టాగ్రామ్‌ చిట్ చాట్‌ లో మహేష్‌ బాబు పై తన అభిమానంను చాటుకున్నాడు. తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన సఫిన్ అభిమాన హీరో గురించి మాట్లాడుతూ మహేష్ బాబు వ్యక్తిత్వం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మహేష్‌ బాబు తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ది చేయడంతో పాటు వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించారు. ఇంకా పలు కార్యక్రమాలను నిర్వహించిన మహేష్ బాబు అభిమానులు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనా సమయంలో కూడా మహేష్‌ బాబు అభిమానులు పలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. తను దత్తత తీసుకున్న గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కూడా మహేష్ బాబు నిర్వహించారు. ఇక ఆయన సినిమాల్లో కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అందుకే ఆయన్ను ఉత్తరాది వారు కూడా అభిమానిస్తారు. ఇప్పుడు ఆ జాబితాలో యంగ్‌ ఐపీఎస్ ఆఫీసర్ సఫిన్ హసన్‌ చేరాడు.