కార్ ప్రమాదం ఎలా జరిగింది అంటే - రాజశేఖర్

Wed Nov 13 2019 10:40:07 GMT+0530 (IST)

That is how the car accident happened - Rajasekhar

హీరో రాజశేఖర్ భారీ ప్రమాదం నుంచి సురక్షితం గా బయట పడ్డారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో అప్పా జంక్షన్ వద్ద జరిగిన ఈ ప్రమాద సరళి.. ఆయన ఎస్.యు.వి కార్ ముందు భాగం నుజ్జు నుజ్జు అయిన తీరు చూస్తుంటే .. ఇది పెను ప్రమాదమేనని అర్థమవుతోంది. మంగళవారం రాత్రి రామోజీ ఫిలింసిటీ లో షూటింగ్ పూర్తి చేసుకుని ఆయన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ ఎస్ 350డి అనే కార్ లో తిరిగి వస్తున్నారు. కార్ ఔటర్ రింగ్ రోడ్ లో పెద్ద గోల్కొండ (శంషాబాద్ మండలం) అప్పా జంక్షన్ వద్ద డివైడర్ ని ఢీ కొట్టింది. దీంతో కార్ పలుమార్లు రోడ్ పైన ఫల్టీలు కొట్టిందని తెలుస్తోంది. ప్రమాద సమయం లో రాజశేఖర్ ఒక్కరే కార్ లో ఉన్నారు. సకాలం లో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడం తో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది.ఈ ప్రమాదం పై హీరో రాజశేఖర్ స్పందించారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదని ఇంటికి క్షేమంగా చేరుకున్నానని వెల్లడించారు. రాజశేఖర్ మాట్లాడుతూ ``మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి  వస్తుండగా ఔటర్ రింగు రోడ్డు లో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడి నే ఉన్నాను. ఎదురు గా వస్తున్న కారు లో వారు ఆగి.. నా కారు దగ్గర కు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి.. విన్ షీల్డ్ లో నుండి బయట కు లాగారు. అప్పుడు  నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసుల కు.. ఆ తర్వాత నా కుటుంబ సభ్యుల కు సమాచారం అందించాను. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత.. మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి.. నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు`` అని తెలిపారు.

ఔటర్ రింగ్ రోడ్ లో ఇలాంటి ప్రమాదాలెన్నో నిత్యం భయపెడుతున్నాయి. సెలబ్రిటీ లు ఔటర్ లో ప్రమాదాలకు గురవుతుండడం కలత కు గురి చేస్తోంది. హీరో రాజశేఖర్ ప్రమాదానికి గురయ్యారు అని తెలియ గానే అభిమానులు కంగారు పడ్డారు. ఆయన క్షేమ సమాచారం తెలుసుకుని పరిశ్రమ వర్గాలు సహా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.