Begin typing your search above and press return to search.

సౌత్‌ నుండి రానాకు మాత్రమే ఆ ఘనత

By:  Tupaki Desk   |   24 July 2021 8:50 AM GMT
సౌత్‌ నుండి రానాకు మాత్రమే ఆ ఘనత
X
యాక్షన్‌ సినిమాల ప్రియులు అమితంగా ఇష్టపడే సూపర్ మ్యాన్ సిరీస్‌ సినిమాలు ఎక్కువగా హాలీవుడ్‌ లోనే వస్తూ ఉంటాయి. హిందీలో క్రిష్‌ సూపర్‌ మ్యాన్‌ కాన్సెప్ట్‌ తో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్‌ ఇప్పటి వరకు వచ్చిన మూడు పార్ట్‌ లు కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్న కారణంగా సూపర్‌ మ్యాన్ అభిమానుల కోసం మరో క్రిష్‌ మూవీ కూడా రూపొందుతోంది. నాల్గవ పార్ట్‌ క్రిష్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్‌ మ్యాన్‌ సిరీస్ లో వచ్చిన క్రిష్ సినిమాకు పోటీ అన్నట్లుగా తెలుగు హీరో రానా కూడా ఒక పాన్‌ ఇండియా సూపర్‌ మ్యాన్‌ సినిమాను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెళ్లడించాడు.

రానా సూపర్‌ మ్యాన్ సినిమా చాలా ఏళ్ల తర్వాత ఏమీ కాదు. అతి త్వరలోనే మొదలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్‌ తో కలిసి తాను చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత సూపర్‌ మ్యాన్‌ కాన్సెప్ట్‌ తో సినిమాను చేయబోతున్నట్లుగా రానా ప్రకటించాడు. ఆ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని.. యాక్షన్‌ సినిమాల ప్రియులకు నచ్చే విధంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. టాలీవుడ్‌ హల్క్‌ గా పేరు దక్కించుకున్న రానా సూపర్‌ మ్యాన్‌ పాత్రలో ఖచ్చితంగా నటించి మెప్పిస్తాడనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు లో సూపర్‌ మ్యాన్‌ కాన్సెప్ట్‌ తో సినిమాలు గతంలో వచ్చినప్పటికి పెద్దగా ఆకట్టుకోలేదు. కనీసం అవి జనాలకు గుర్తుకు కూడా లేవు. కనుక రానా సూపర్ మ్యాన్‌ సినిమాను తీసుకు వచ్చి సక్సెస్‌ దక్కించుకుంటే మాత్రం సౌత్‌ ఇండియాలోనే మొదటి సూపర్‌ మ్యాన్‌ మూవీ హీరోగా రానాకు క్రెడిట్‌ దక్కుతుంది. రానా ఇప్పటికే హిందీ సినిమాల్లో నటించడంతో పాటు అక్కడ బాగా పాపులర్‌ అయ్యాడు. బాహుబలికి ముందే అన్ని చోట్ల ఫేమస్ అయిన రానా బాహుబలి తర్వాత మరింతగా స్టార్ డమ్ ను దక్కించుకున్నాడు. కనుక రానా నటించబోతున్న సూపర్‌ మ్యాన్‌ పాన్‌ ఇండియా మూవీ ఖచ్చితంగా మంచి క్రేజ్ ను దక్కించుకోవడం ఖాయంగా తెలుస్తోంది. అయితే రానాతో ఎవరు సూపర్‌ మ్యాన్‌ కాన్సెప్ట్‌ మూవీ చేయబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.

దర్శకుడు ఎవరు నిర్మాత ఎవరు అనే విషయాలు ఎప్పటికి క్లారిటీ వస్తాయో చూడాలి. ఇక రానా నటించిన విరాటపర్వం సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. పవన్‌ తో చేస్తున్న మూవీ ఈ ఏడాదిలో విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటిని కూడా ఫినీష్‌ చేసి మరే సినిమాకు కమిట్‌ అవ్వకుండా కేవలం సూపర్‌ మ్యాన్‌ సినిమాతోనే బిజీ అవ్వబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. రానా ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఒక ఎత్తు అయితే సూపర్‌ మ్యాన్‌ మూవీ ఒక ఎత్తు అనడంలో సందేహం లేదు. ఇటీవల అనారోగ్యం వల్ల చాలా ఇబ్బంది పడ్డ రానా ఆ సమయంలో చాలా సన్నగా అయ్యాడు. మళ్లీ ఇప్పుడు మంచి ఫిజిక్ ను పెంచాడు. కనుక సూపర్‌ మ్యాన్‌ పాత్రకు ఆయన నూటికి నూరుపాళ్లు సెట్‌ అవ్వడం ఖాయం అంటున్నారు.