Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ వరుణ్ తో మూడోసారి జతకట్టనుందా..?

By:  Tupaki Desk   |   29 March 2020 3:30 AM GMT
ఆ హీరోయిన్ వరుణ్ తో మూడోసారి జతకట్టనుందా..?
X
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఈ మధ్య సినిమాల విషయంలో ఆచితూచి అడుగేస్తున్నట్లు కన్పిస్తున్నాడు. ఎందుకంటే రీసెంట్ గా అంతరిక్షం, గడ్డలకొండ గణేష్, ఇప్పుడు చేస్తున్న బాక్సర్ సినిమాలను చూస్తే ఈజీగా అర్ధమవుతుంది. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడిప్పుడే కెరీర్ ని ఒక దశలోకి మలుచుకోవడానికి ట్రై చేస్తున్నాడు వరుణ్. ఇక తను చేస్తున్న ప్రస్తుత సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగనుందట. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకునిగా పరిచయమవుతున్నాడు. అంతరిక్షం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కిరణ్ ఆ సినిమా టైంలోనే ఈ కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం.

ఇక బాక్సింగ్ నేపథ్య సినిమా కాబట్టి వరుణ్ ఇప్పటికే విదేశాలకు వెళ్లి బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నాడట. వరుణ్ అన్నివిధాలా బాక్సర్ గా కనిపించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ సినిమాను అల్లు బాబీ, ముద్ద సిద్దులు సంయుక్తంగా నిర్మిస్తున్నారట. ఈ సినిమాకోసం కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ ను ఓకే చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ అవసరం అవుతుందట.. అందుకోసం లావణ్య త్రిపాఠీని పరిశీలిస్తున్నట్లు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆఫీసియల్ గా ఎవరిని తీసుకున్నారు.. అనేది చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయాల్సి ఉంది. ఈ సినిమాలో ఒకవేళ లావణ్య త్రిపాఠీ ఓకే అయితే మాత్రం వరుణ్ తో తనకిది మూడో సినిమా అవుతుంది.