విజయ్ దేవరకొండ.. అందరం కలిసి చచ్చిపోదాం టెన్షన్ ఎందుకు!

Wed May 25 2022 13:05:21 GMT+0530 (IST)

Tharun Bhaskar about VijayDevarkonda

యంగ్ అండ్ మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ తాజాగా ఈవీలో ప్రసారం అయ్యే అలీ తో సరదాగా టాక్ షో లో పాల్గొన్నాడు. వచ్చే వారం టెలికాస్ట్ కాబోతున్న ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోలో తరుణ్ భాస్కర్ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. ఎపిసోడ్ మొత్తం కూడా చాలా సరదాగా ఆయన అప్స్ అండ్ డౌన్స్ ను చూపించబోతున్నట్లుగా ప్రోమో చూస్తే అర్థం అవుతుంది.తరుణ్ భాస్కర్ కు విజయ్ దేవరకొండ మరియు విశ్వక్ సేన్ లు మంచి స్నేహితులు. ఇద్దరితో కూడా కలిసి వర్క్ చేసిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా ఉన్నాడు. పెద్ద రోల్స్ కాకుండా చిన్న చిన్న పాత్రలను.. గెస్ట్ రోల్స్ ను ఆయనతో చేయిస్తున్నారు. చిన్న చిన్న పాత్రలే అవ్వడం వల్ల తాను కూడా కాదనకుండా చేస్తున్నట్లుగా తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు.

ఇక విజయ్ దేవరకొండతో సినిమా చేసే అవకాశం ఉందా అంటూ అలీ అడిగిన సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలను తరుణ్ భాస్కర్ చేశాడు. విజయ్ దేవరకొండ సినిమా అనేది ఒక వైల్డ్ కార్డ్ వంటిది. అది నా వద్ద ఉంది.. నేను వరుసగా మూడు ప్లాప్ లు అయితే అప్పుడు ఆ కార్డ్ ను ఉపయోగించుకుని విజయ్ తో సినిమా చేస్తాను అన్నాడు. అంటే ఎప్పుడు అడిగితే అప్పుడు విజయ్ దేవరకొండ డేట్లు ఇస్తాడు అన్నట్లుగా తరుణ్ చెప్పుకొచ్చాడు.

ఇక పెళ్లి చూపులు సినిమా షూటింగ్ సందర్బంగా ఒక పాత ట్రక్ లో ప్రయాణిస్తుండగా సడన్ గా ఆ ట్రక్ యొక్క బ్రేక్ లు ఫెయిల్ అయ్యాయి. దాంతో వెంటనే హ్యాండ్ బ్రేక్ లాగితే అది చేతికి వచ్చేసింది. అప్పటి వరకు టెన్షన్ గా ఉన్న విజయ్ కాస్త రిలాక్స్ గా కనిపించాడు. ట్రక్ చెట్టుకు వెళ్లి ఢీ కొట్టి అదృష్టవశాత్తు ఏం కాకుండా బయట పడ్డాం. అప్పుడు విజయ్ దేవరకొండ టెన్షన్ ఎందుకు అందరం కలిసి చచ్చిపోదుము అన్నాడు.

విజయ్ దేవరకొండ జీవితాన్ని టెన్షన్ అస్సలు తీసుకోడు అన్నట్లుగా తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇంకా ఎన్నో విషయాలను కూడా అలీ ప్రశ్నించి తరుణ్ భాస్కర్ నుండి ఆసక్తికర సమాధానాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ తో ఈయన ఒక సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అంతే కాకుండా తరుణ్ భాస్కర్ హీరోగా నటించాలని కూడా చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టాను అన్నాడు. సల్మాన్ కు నో చెప్పాను అంటూ ఇంకా చాలా ముచ్చట్లను అలీతో సరదాగా షో లో తరుణ్ భాస్కర్ చెప్పాడు.