Begin typing your search above and press return to search.

ఇంతకీ బ్రహ్మీ.. తరుణ్ భాస్కర్ ను తిట్టిండ, పొగిడిండ?

By:  Tupaki Desk   |   2 Feb 2023 6:06 PM GMT
ఇంతకీ బ్రహ్మీ.. తరుణ్ భాస్కర్ ను తిట్టిండ, పొగిడిండ?
X
సైన్మ అనే షార్ట్ ఫిలింతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న తరుణ్ భాస్కర్ తర్వాత పెళ్లిచూపులు అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. విజయ్ దేవరకొండ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయనకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకుంటూ వెళ్లకుండా తనకు నచ్చిన సబ్జెక్టు... నిర్మాతలు మెచ్చిన సబ్జెక్టులు మాత్రమే చేస్తూ ముందుకు వెళుతున్నారు.

తరుణ్ భాస్కర్ కీడా కోలా అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి బ్రహ్మానందం లుక్ కూడా విడుదల చేశారు. బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్ లుక్ కీడా కోలా యూనిట్ రిలీజ్ చేసింది. అంతే కాదు స్వయంగా తరుణ్ భాస్కర్ బ్రహ్మానందం ముఖాన్ని ఒక ఆయుర్వేదిక్ ద్వారా చిత్రీకరించి దాన్ని నిన్న పుట్టిన రోజు సందర్భంగా బ్రహ్మానందం నివాసానికి తీసుకువెళ్లి ఆయనకు బహుకరించే ప్రయత్నం చేశారు.

అయితే ఆ బహుకరించే క్రమంలో ఈ పెయింటింగ్ ఎలా ఉంది.. అని బ్రహ్మానందాన్ని అడిగితే నా మొహంలా ఉంది.. అని ఆయన కామెంట్ చేశారు అంట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న తరుణ్ భాస్కర్.. ఇప్పుడు ఆయన నన్ను తిట్టాడా? లేదా మెచ్చుకున్నాడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో తన ఫన్నీ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు. దీనిపై నెటిజన్స్ కూడా స్పందిస్తూ... ఎమోజీలు పెడుతున్నారు.

ఇక బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా జబర్దస్త్ టీం సభ్యులు సహా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పడమే కాదు... స్వయంగా సత్కరించి వచ్చారు. బ్రహ్మానందం సుమారు 1000 కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కారు. ప్రస్తుతానికి ఆయన సినిమాలకు కొంచెం దూరంగా ఉంటున్నారు. ఇది వరకు చిన్నా చితకా సినిమాలలో కూడా నటిస్తూ వచ్చిన ఆయన... ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభిస్తే మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.