విజయ్ చెప్పిన విషయాన్ని తెగ గూగుల్ చేస్తున్నారు

Thu Nov 08 2018 13:19:45 GMT+0530 (IST)

Thanks to Vijay-starrer Sarkar, now people are googling for section 49P

ఈమద్య కాలంలో కొద్ది పాటి చదువు వచ్చిన వారు కూడా ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ గురించి తెలుసో తెలియదో కాని గూగుల్ గురించి తెలిసే ఉంటుంది. ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలి అంటే అంతా ఆశ్రయించేది గూగుల్ ను అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జనాలు గూగుల్ లో సెక్షన్ 49 పి అనే టాపిక్ ను సెర్చ్ చేస్తున్నారట. ఎన్నికలకు సంబంధించిన ఈ సెక్షన్ ఎవరి ఓటైనా దొంగ ఓటు పడితే మళ్లీ ఓటును పొందే అవకాశం ఉంది. విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రంలో ఈ విషయాన్ని మురుగదాస్ చెప్పడం జరిగింది.‘సర్కార్’ చిత్రం కథ మొత్తం ఈ సెక్షన్ చుట్టు తిరుగుతుందనే విషయం తెల్సిందే. సర్కార్ చిత్రం లో చూపించిన సెక్షన్ 49 పి అసలు నిజంగా ఉందా - ఉంటే దాని గురించి ఇంకా డిటైల్డ్ గా తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. మొన్నటి నుండి ఎన్నో కోట్ల మంది ఈ విషయం గురించి సెర్చ్ చేసినట్లుగా తెలుస్తోంది. దొంగ ఓట్లు - అవినీతి రాజకీయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట భారీ వసూళ్లను సాధిస్తున్న విషయం తెల్సిందే.

సర్కార్ సినిమాలో ఇచ్చిన సోషల్ మెసేజ్ అందరికి ఉపయోగపడేది - అందరు ఒకసారి ఆలోచించదగ్గ విషయం. అందుకే గూగుల్ లో సెక్షన్ 49 గురించి పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. సెక్షన్ 49 అనేది ఓటర్లకు చాలా మంచి అవకాశం అని - ఒకవేళ ఓటు ఎవరైనా వేసినా కూడా దాన్ని తిరిగి పొందే హక్కు ఓటరుకు ఉందని చెప్పే ఈ సెక్షన్ గురించి మురుగదాస్ అందరికి తెలియజేయడం అభినందనీయం.