'థాంక్యూ' ఇటలీ షెడ్యూల్ పూర్తి.. చైతన్య - రాశీఖన్నా సెల్ఫీ..!

Fri May 07 2021 16:21:51 GMT+0530 (IST)

'Thankyou' Italy schedule complete

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య - డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''థాంక్యూ''. ఇందులో చైతూ సరసన బబ్లీ బ్యూటీ రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగులు నిలిపేస్తున్న సమయంలో 'థాంక్యూ' చిత్ర బృందం తదుపరి షెడ్యూల్ కోసం ఇటలీ వెళ్ళింది. అయితే కోవిడ్ ఎఫెక్ట్ తో షూటింగ్ రద్దు చేసుకున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇవన్నీ అవాస్తవాలని ఇప్పుడు తేలిపోయింది. 'థ్యాంక్యూ' ఇటలీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ షెడ్యుల్ లో నాగ చైతన్య - రాశీఖన్నా పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.'థాంక్యూ' మూవీ ఇటలీ షెడ్యూల్ పూర్తి అయ్యిందని చెబుతూ.. చిత్ర బృందం కలిసి దిగిన ఓ ఫోటోని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు షూటింగ్ లొకేషన్ లో నాగ చైతన్య - రాశిఖన్నా కలిసి దిగిన ఓ సెల్ఫీ ఫొటోని రాశి సోషల్ మీడియా మధ్యమాలలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా 'థ్యాంక్యూ' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ - హర్షిత్ రెడ్డి లు కలిసి నిర్మిస్తున్నారు. బీవీఎస్ రవి ఈ సినిమాకి స్టోరీ అందించడంతో పాటు డైలాగ్స్ రాస్తున్నారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.