Begin typing your search above and press return to search.

'థాంక్యూ' టీజర్: లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతూ..!

By:  Tupaki Desk   |   25 May 2022 12:04 PM GMT
థాంక్యూ టీజర్: లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతూ..!
X
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''థాంక్యూ''. ఇందులో చైతూ సరసన రాశీ ఖన్నా - మాళవికా నాయర్ - అవికా గోర్ వంటి ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

'మనం' వంటి క్లాసిక్ తర్వాత నాగచైతన్య - డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు - గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ''థాంక్యూ'' టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

'నా సక్సెస్ కు నేనే కారణం' అని చైతూ కోపంగా ఇంగ్లీష్ లో అంటుండగా.. 'నువ్ సెల్ఫ్ సెట్రిక్ యారోగెంట్ గా మారుతున్నావ్. నేను తప్ప నీ లైఫ్ లో ఇంకొకరికి చోటే లేదు' అని రాశీ ఖన్నా ఏడుస్తూ చెప్పడంతో ఈ టీజర్ ప్రారంభమైన ఈ టీజర్ అలరిస్తోంది.

ఓ వ్యక్తి తన జీవితంలో తప్పులను సరిచేసుకుంటూ.. తనని తాను అన్వేషించుకుంటూ సాగించే ప్రయాణమే ''థాంక్యూ'' సినిమా కథాంశమని టీజర్ ని బట్టి తెలుస్తుంది. ఇందులో నాగచైతన్య పాత్రలో మూడు దశలను చూపించారు.

టీనేజ్ లో మాళవిక - కాలేజ్ డేస్ లో అవికా - పరిపక్వత చెందిన దశలో రాశీ లతో చైతూ ప్రేమాయణం సాగించినట్లు తెలుస్తోంది. అయితే మూడు స్టేజ్ లలో చై గెటప్స్ అండ్ లుక్స్ లో వెరీయేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. 'ప్రేమమ్' తర్వాత మరోసారి ఇలాంటి పాత్రలో మెప్పించబోతున్నాడు.

ఇందులో రొమాంటిక్ సీన్స్ తో పాటుగా తగినంత యాక్షన్ కూడా ఉన్నట్లు టీజర్ లో హింట్ ఇచ్చారు. 'లైఫ్ లో ఇంక కాంప్రమైజ్ అయ్యేదే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికి వచ్చాను' 'నన్ను నేను సరి చేసుకోడానికి.. నేను చేస్తున్న ప్రయాణమే' అంటూ చైతన్య చెప్పే డైలాగ్స్ తో సినిమా నేపథ్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.

'థాంక్యూ' చిత్రానికి బీవీఎస్ రవి స్టోరీ అందించడంతో పాటుగా సంభాషణలు రాశారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా నాగచైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'మజిలీ' 'వెంకీమామ' 'లవ్ స్టోరీ' 'బంగార్రాజు' వంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.

ఇప్పుడు 'థాంక్యూ' టీజర్ చూస్తుంటే చైతూ కి మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని 2022 జూలై 8న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.