Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ : ఆన్‌ లొకేషన్‌ 'థాంక్యూ'

By:  Tupaki Desk   |   24 Jan 2022 12:07 PM GMT
క్లిక్‌ క్లిక్‌ : ఆన్‌ లొకేషన్‌  థాంక్యూ
X
నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ లవ్‌ స్టోరీ మరియు బంగార్రాజు సినిమాలతో సక్సెస్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం చైతన్య 'థాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదే సమయంలో నాగ చైతన్య బాలీవుడ్‌ మూవీ లాల్ సింగ్ చద్దా కూడా విడుదల కాబోతుంది. బంగార్రాజు మూవీ హడావుడి తగ్గడంతో ప్రస్తుతం చైతూ 'థాంక్యూ' సినిమా ను ముగించే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది. విక్రమ్‌ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న థ్యాంక్యూ సినిమా ను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కు సంబంధించిన ఆన్ లొకేషన్‌ స్టిల్స్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నాగ చైతన్య మరియు రాశి ఖన్నాలు కలిసి ఈ షూటింగ్‌ లో పాల్గొంటున్నారు.

విక్రమ్‌ కుమార్‌ ప్రతి సినిమా కూడా విభిన్నమైన కథ మరియు కథనంతో సాగుతూ ఉంటాయి. కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా అదే తరహా లో ఉంటుందనే నమ్మకంతో అక్కినేని అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న థ్యాంక్యూ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. కాని కరోనా థర్డ్‌ వేవ్‌ వల్ల వాయిదా పడ్డ సినిమాలన్నీ కూడా సమ్మర్ లో విడుదలకు సిద్దం అవుతున్నాయి. కనుక సమ్మర్‌ లో థ్యాంక్యూ కు అవకాశం ఉంటుందా అనేది చూడాలి. దిల్‌ రాజు ఒక మంచి డేట్‌ ను చూసి థ్యాంక్యూను రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు.

నాగచైతన్య మరియు రాశిఖన్నా జోడీగా నటిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఉగాది లేదా అంతకంటే కంటే ముందుగానే సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. షూటింగ్‌ ముగించిన తర్వాత సినిమా అప్డేట్ ను ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి థ్యాంక్యూ సినిమా ఒక మంచి ఫీల్ గుడ్‌ లవ్‌ స్టోరీ తో రూపొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ గత చిత్రాల నేపథ్యంలో ఈ సినిమా మినిమం గ్యారెంటీ హిట్ అవుతుందనే నమ్మకంను మీడియా వర్గాల వారు మరియు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.