Begin typing your search above and press return to search.

'రిచిగాడి పెళ్లి' పాటకు థమన్ ప్రశంసలు..!

By:  Tupaki Desk   |   25 Sep 2021 9:30 AM GMT
రిచిగాడి పెళ్లి పాటకు థమన్ ప్రశంసలు..!
X
నవీన్‌ నేని - ప్రణీత పట్నాయక్‌ - సత్య ఎస్‌.కె - కిషోర్‌ మర్రి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ''రిచిగాడి పెళ్లి''. కె.యస్‌. హేమరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కితోంద. కె.ఎస్‌. ఫిలిం వర్క్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ‘‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా’’ అనే గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ విడుదల చేశారు.

'ఏమిటిది మతి లేదా.. ప్రాణమా' పాటకు సత్యన్‌ స్వరాలు సమకూర్చగా.. గేయ రచయిత అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. ప్రముఖ సింగర్ కైలాష్‌ ఖేర్‌ ఈ గీతాన్ని తనదైన శైలిలో ఆలపించారు. సాంగ్ విడుదల సందర్భంగా థమన్ మాట్లాడుతూ.. ''రిచిగాడి పెళ్లి" చిత్రంలోని 'ఏమిటిది మతి లేదా.. ప్రాణమా..' సాంగ్ చూశాను. కైలాష్ గారు ఏక్స్ట్రార్డినరీగా పాడారు. ఆయన వాయిస్ ఈ పాటకి చాలా బాగుంది అని అన్నారు.

''నాకు హేమ రాజ్ 'వైశాలి' సినిమా నుంచి తెలుసు. ఈ సినిమాకు ఆయన పని చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరూ మంచి ప్రయత్నంతో ఈ సినిమా చేస్తున్నారు. అందరూ సపోర్ట్ చేయాలి. ఈ సాంగ్ వింటుంటే నన్ను లొకేషన్ కు తీసుకెల్లింది. అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ తో కైలాస్ గారు బ్యూటిఫుల్ గా పాడారు. సత్యన్‌ మంచి ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా అందరికీ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని థమన్ అన్నారు.

ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. 'రిచి గాడి పెళ్లి' వంటి విచిత్రమైన చిత్రంలో 'ఏమిటిది మతి లేదా.. ప్రాణమా' అనే వేదాంతాన్ని బోధించే పాట ఇది. అంత పెద్ద వేదాంతాన్ని బోధించినా కూడా అలతి అలతి పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో మధురమైన బాణీలో ఈ పాట ఉంటుంది. సృజనాత్మక సినిమాకి బడ్జెట్ అనేది పరిధి కాదు. ఎంత తక్కువ బడ్జెట్లో అయినా ఏంతో అద్భుతమైన కథనాన్ని చెప్పవచ్చని నిరూపించిన చిత్రమిది. చిన్న ఆట వల్ల ఎన్ని జీవితాల్లో, ఎన్ని ప్రేమల్లో, ఎన్ని స్నేహాల్లో ఎన్ని మార్పులు వస్తాయి, ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం. మీ అందరినీ కచ్చితంగా నచ్చుతుంది. అలాగే నేను రాసిన పాట కూడా మిమ్మల్నందరినీ కచ్చితంగా అలరిస్తుంది'' అని అన్నారు.

దర్శకుడు హేమరాజ్ మాట్లాడుతూ.. "రిచి గాడి పెళ్లి" అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. అనంత శ్రీరామ్ రాసిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తమన్ గారు పాట చాలా బాగుందని మెచ్చుకున్నారు. వారికి మా కృతజ్ఞతలు. ఇంత మంచి పాట అందించిన అనంత శ్రీరామ్ కు సింగర్ కైలాస్ గారికి ధన్యవాదాలు. మా డిఓపి విజయ్ ఉలగనాథ్ గారు చేసిన వర్క్ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను'' అని అన్నారు.