బన్నీ ఫ్యాన్స్ కోరికను కేటీఆర్ తీర్చుతాడా?

Tue Jan 21 2020 19:56:55 GMT+0530 (IST)

Thaman Samajavaragamana impresses KTR

అల్లు అర్జున్.. త్రివిక్రమ్ ల కాంబోలో సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా బన్నీ కెరీర్ లో బెస్ట్ నెంబర్స్ నమోదు అవుతున్నాయి. ఈ చిత్ర విజయంలో పాటలు కీలక పాత్ర పోషించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని బన్నీ మరియు త్రివిక్రమ్ లు కూడా ఒప్పుకుని సినిమా సక్సెస్ క్రెడిట్ ను థమన్ కు ఇచ్చేసిన విషయం తెల్సిందే.తాజాగా కేటీఆర్ కూడా సామజవరగమన పాటపై ప్రశంసలు కురిపిస్తు థమన్ నిన్ను నువ్వే మించి పోయావు అంటూ అభినందించిన విషయం తెల్సిందే. కేటీఆర్ ప్రశంసలకు థమన్ కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. వీరిద్దరి పోస్ట్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో కేటీఆర్ సామజవరగమన పాట ట్వీట్ కు బన్నీ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా మంచి ఎంటర్ టైనర్ అని మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

కేటీఆర్ కు పలువురు అల వైకుంఠపురంలో సినిమా చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి బన్నీ అభిమానుల రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకుని మంత్రి కేటీఆర్ అల వైకుంఠపురంలో సినిమాను చూస్తాడా అనేది చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్ల మార్క్ ను క్రాస్ చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ వసూళ్ల జోరు ఎక్కడి వరకు కొనసాగుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.