Begin typing your search above and press return to search.

కమర్షియల్ సినిమాకు మ్యూజిక్ కష్టమట!

By:  Tupaki Desk   |   4 Dec 2019 1:30 AM GMT
కమర్షియల్ సినిమాకు మ్యూజిక్ కష్టమట!
X
కమర్షియల్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం ఏంటో కష్టమైపోతుందని అంటున్నాడు తమన్. లేటెస్ట్ గా వెంకీ మామ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నాడు.

రాను రాను కమర్షియల్ సినిమాకు మ్యూజిక్ చేయడం కష్టమవుతోంది. లవ్ స్టోరీ, ఇంకేదైనా అయితే చేసేయొచ్చు అది ఎలాగో మనలో ఉండే ఫీలింగ్ కాబట్టి మ్యూజిక్ కంపోజ్ చేయడం ఈజీ. కానీ కమర్షియల్ సినిమాకు అన్నీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. హీరోని ఎప్పటికప్పుడు మ్యూజిక్ ఎలివేట్ చేస్తూ ఉండాలి. ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటాయని అంటున్నాడు. ఇక చివరి వరకూ ఎక్కువ ప్రెజర్ ఉండేది కూడా తమ మీదే అంటూ వాపోయాడు.

అంతే కాదు సినిమాకు పనిచేసే 24 క్రాఫ్ట్స్ కంటే సంగీత దర్శకుడికే ఎక్కువ ఖర్చు ఉంటుందని అన్నాడు. మిగతా వారు రెమ్యునరేషన్ ని డైరెక్ట్ గా బ్యాంకు లో వేసుకుంటే తాము మాత్రం సింగర్స్ - లిరిసిస్ట్ - కీ బోర్డ్ ప్లేయర్ - డ్రమ్స్ కి ఇలా అందరికీ ఇవ్వాల్సి ఉంటుందని వాపోయాడు. ప్రస్తుతం తనకు మంచి రెమ్యునరేషన్ అందుతుందని ఎప్పుడూ నిర్మాతలను డిమాండ్ చేయలేదని తన హిట్స్ చూసి వారే తగిన రెమ్యునరేషన్ ఇస్తారని చెప్పుకొచ్చాడు.

ఇక ఆడియో రిలీజ్ లేకపోవడంపై కూడా తమన్ స్పందించాడు. ఆడియో రిలీజ్ లేకపోతేనేం ఆరు పాటలకు చొప్పున ఆరు ఫంక్షన్స్ ఉన్నట్టే ఉంది అన్నాడు. ఒక్కో సింగిల్ రిలీజ్ చేస్తేనే రీచ్ ఉంటుందని మొత్తం ఆడియో ఒకే సరి వదిలితే ఇప్పటి ఆడియన్స్ కి కిక్ ఉండదని అన్నాడు.