అఘోరాలపై తీవ్రంగా పరిశోధించాడట

Thu Nov 25 2021 05:00:01 GMT+0530 (IST)

Thaman Intensive research on agora

నటించే వాళ్లకే కాదు.. ప్రవృత్తిని మ్యూజికల్ థీమ్ గా మలిచేందుకు కూడా అఘోరాలపై చాలానే పరిశోధించాల్సి వచ్చిందని చెప్పి ఆశ్చర్యపరిచాడు థమన్. దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్వరకర్తగా వెలిగిపోతున్న థమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత భారీ సినిమాలకు పని చేస్తున్నారు.బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ కోసం అతను ట్యూన్లు రెడీ చేశాడు. మొదటి రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ లో బీజీఎం అదిరిపోయిందన్న టాక్ వినిపించింది.
బాలకృష్ణ- బోయపాటిల మధ్య సింక్ వల్లే తాము కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ను అందించగలిగామని థమన్ చెప్పారు. ఇంకా అఖండ గురించి మాట్లాడుతూ-``ఈ సినిమాలో నిప్పు ఉంది. ఇందులో మంచి ఎమోషన్ కూడా ఉంది. ఏదైనా సినిమాలో ఎమోషన్ కనెక్ట్ అయితే అది పెద్ద హిట్ అవుతుంది. బాలకృష్ణ తన నటనతో అదరగొట్టాడు. శ్రీకాంత్- జగపతిబాబు కూడా బాగా చేశారు. అఖండ అభిమానులకు - మాస్ కి ఫుల్ మీల్ ఫీస్ట్`` అని తెలిపారు.

అలాగే కరోనా గ్యాప్ వల్ల మ్యూజిక్ కోసం మరింతగా శ్రమించారట థమన్. బీజీఎంని కూడా ఫ్రెష్ ఫీల్ కోసం మరోసారి రీడిజైన్ చేశాడట. అలాగే అఘోరాలపై పరిశోధన గురించి తెలిపాడు. అఘోరాల గురించి స్థిరంగా  తీవ్ర పరిశోధన చేసాము. వారు ఉపయోగించే సంగీత శైలి .. సాధనాలను అర్థం చేసుకోవడానికి నేను కూడా పుస్తకాలు చదివాను.. అని తెలిపారు. అఘోరా క్యారెక్టర్ ఎంట్రీ తర్వాత సినిమా రేంజ్ మారిపోతుంది. ఇది పూర్తిగా కొత్త జోన్ లో  ఉంటుందన్నారు.

అఘోరాల గురించి అఖండ మరిన్ని సంగతుల్ని  వెల్లడిస్తుందని తెలిపారు. ఒకరు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే విషయంపై కూడా మీకు స్పష్టత వస్తుందన్నారు. అలాగే టైటిల్ ట్రాక్ కూడా అదిరిపోతుందని బాలయ్యకు బాగా నచ్చిందని వెల్లడించారు. పాటల కోసం వంద మంది పైగా గాయకులను ఉపయోగించామని వెల్లడించారు. అఖండ డిసెంబర్ లో విడుదల కానుండగా ఇప్పటికే టీమ్ ప్రచారంలో బిజీగా ఉంది.