మహేశ్ నమ్మకాన్ని థమన్ నిలబెట్టుకోలేకపోయాడా..?

Fri May 13 2022 08:00:01 GMT+0530 (IST)

Thaman In Sarkaru Vari Paata

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు 'ఎస్ఎస్ థమన్'. పెద్ద సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిన థమన్.. ఈ మధ్య కాలంలో కేవలం తన సంగీతంతోనే కొన్ని చిత్రాలను సూపర్ హిట్ అయ్యేలా చేశారు.ఫుల్ ఫార్మ్ లో దూసుకుపోతున్న థమన్.. ఇప్పుడు లేటెస్టుగా ''సర్కారు వారి పాట'' సినిమా పాటలతో వచ్చారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు - కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా పరశురాం పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది.

గతంలో థమన్ 'దూకుడు' 'బిజినెస్ మ్యాన్' 'ఆగడు' వంటి మూడు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించడంలో.. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత మహేష్ బాబు నటించే చిత్రానికి వర్క్ చేస్తుండటంతో SVP మ్యూజిక్ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

దీనికి తగ్గట్టుగానే 'కళావతి' 'పెన్నీ' మ్యూజిక్ వీడియోలు - సర్కారు వారి టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోయాయి. అయితే తీరా సినిమా రిలీజ్ అయ్యాక 'కళావతి' పాట మినహా.. మిగతా సాంగ్స్ ఆ స్థాయిలో లేవనే కామెంట్స్ వచ్చాయి. 'మ.. మ.. మహేష్' పాట కాపీ ట్యూన్ అని ఇప్పటికే నెటిజన్లు తేల్చేశారు.

ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యారని తెలుస్తోంది. తమన్ సాంగ్స్ కంటే ఆర్ ఆర్ అదరగొడతాడనే పేరుంది. అందుకే ప్రతీ సినిమా నుంచీ ఆడియన్స్ ఏదొక కొత్త బీజీఎం ఎక్స్ పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 'సర్కారు వారి పాట' విషయంలో కూడా ప్రేక్షకులు ఇంకా ఎక్కువే ఆశించారు.

కానీ నేపథ్య సంగీతంలో థమన్ నిరాశ పరిచాడని.. ఇంకా బెటర్ గా చేసి ఉండొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహేష్ బాబు మీదున్న ప్రేమతో మనసులో నుంచి ఈ సర్కారు వారి పాటలు వచ్చాయని సంగీత దర్శకుడు చెబుతూ వచ్చారు. కానీ ఆ రేంజ్ లో లేదని అంటున్నారు.

మొత్తం మీద ఆరేళ్ళ తరువాత అవకాశం ఇచ్చి.. మ్యూజిక్ మీద మహేశ్ పెట్టుకున్న నమ్మకాన్ని థమన్ నిలబెట్టుకోలేకపోయాడనే విమర్శలు వస్తున్నాయి. అయితే సన్నివేశాల్లో బలం లేనప్పుడు సంగీత దర్శకుడు మాత్రం ఏం చేయగలడని తమన్ కు మద్దతుగా నిలిచేవారు కూడా ఉన్నారు.

ఇకపోతే మహేష్ బాబు నటించే తదుపరి చిత్రానికి కూడా థమనే మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న #SSMB28 చిత్రానికి సాంగ్స్ రెడీ చేస్తున్నారు. ఈసారైనా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.