'అఖండ'ను కూర్చునికాదు .. నుంచుని చూస్తారు: తమన్

Sun Nov 28 2021 10:01:19 GMT+0530 (IST)

Thaman In Akhanda Prerelease Event

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన 'అఖండ' సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. నిన్నరాత్రి హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. "ముందుగా ఈ  కార్యక్రమానికి వచ్చిన  బన్నీగారికీ .. రాజమౌళిగారికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. మేమంతా ఒక ఏడాదిన్నరగా శివుడి ట్రాన్స్ లో ఉన్నాము. ఇండస్ట్రీకి శివుడిలాంటి మనిషి బాలయ్యగారు. ఆయన నుంచి మాకు చాలా ఎనర్జీ వచ్చింది.ఈ సినిమా కోసం మా టీమ్ అంతా కూడా డే అండ్ నైట్స్ పనిచేశాము. గడిచిన 48 రోజులుగా నేను 'అఖండ'ను గురించి తప్ప మరి దేని గురించి ఆలోచించలేదు. బాలయ్య బాబు ఒక ట్రాన్స్ ఫార్మర్ అయితే ఆయనకి సరిపడా ఓల్టేజ్ ఇచ్చేది బోయపాటిగారు. ఒక్కొక్క సీన్ లో ఆ ట్రాన్స్ ఫార్మర్ పేలుతుంటే మేము ఎంతో ఎంజాయ్ చేశాము. బాలకృష్ణ గారి 'భైరవద్వీపం' సినిమాతోనే నా కెరియర్ మొదలైంది. ఈ రోజున నేను 'అఖండ' మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాను  అందుకు కారణమైన బాలకృష్ణగారికి నేను రుణపడి ఉన్నాను.

బోయపాటిగారికి ఎక్కడ ఉప్పు ఎక్కువేయాలి .. ఎక్కడ కారం కరెక్టుగా వేయాలనేది బాగా తెలుసు. ఈ సినిమాను మీరు థియేటర్లో కూర్చుని చూడరు .. నుంచుని చూస్తారు. సినిమా మొత్తంలో ఒక  70 సీన్లు ఉంటే 50 సీన్లకు లేచే నుంచుంటారు. అందుకు కారణం బాలకృష్ణగారి ఎనర్జీ .. ఆయన ఈ సినిమాను డ్రైవ్ చేసిన తీరు అనే చెప్పాలి. ఈ సినిమా కోసం మా టీమ్ అంతా కూడా ఎంతో అంకితభావంతో పనిచేసింది. ఎవరమూ కూడా 40 రోజులు నిద్రపోలేదు. అంతా ఆ దేవుడే చూసుకుంటాడనుకుని అలాగే పనిచేశాము.

ఈ సినిమాను చివరి నిముషం వరకూ ఒక పెళ్లి కూతురులా చూసుకుని పంపిస్తున్నాము. ఇంతమంచి సినిమాను మాకు ఇచ్చిన బోయపాటి గారికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఇది కమర్షియల్ సినిమా అని నేను చెప్పలేను .. ఇది చాలా డిఫరెంట్ సినిమా అని మాత్రం చెప్పగలను. కృష్ణ .. సౌమ్య .. శివమణి .. లిరిక్ రైటర్స్ అంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్లందరికీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ 'జై బాలయ్య' అనకుండా మాత్రం ఉండలేరు" అంటూ ముగించారు.