లైఫ్ ఇచ్చిన మహేష్ కే కౌంటరా థమన్?

Mon Jan 20 2020 23:00:01 GMT+0530 (IST)

Thaman Gives Counter to Mahesh Babu

అల వైకుంఠపురంలో చిత్రం సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. అల్లు అర్జున్.. త్రివిక్రమ్ ల కాంబోకు హ్యాట్రిక్ దక్కింది. ఈ చిత్రం సక్సెస్ క్రెడిట్ ను పూర్తిగా థమన్ కే కట్టబెడుతూ త్రివిక్రమ్ మరియు బన్నీలు మాట్లాడటం జరిగింది. ఇక వైజాగ్ లో జరిగిన సక్సెస్ వేడుకలో థమన్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలు ఇండైరెక్ట్ గా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు కౌంటర్ అన్నట్లుగా ఉన్నాయి అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.థమన్ మాట్లాడుతూ.. నిజమైన కలెక్షన్స్ చెబుతున్నాం.. ఈ రోజు గెలిచాం నిలిచాం మేము ఆపము అన్నాడు. ఆ మాటలకు అల్లు అరవింద్ మరియు త్రివిక్రమ్ గట్టిగా నవ్వడం జరిగింది. నిజమైన కలెక్షన్స్ చెప్పాం అంటూ సరిలేరు నీకెవ్వరు సినిమాను థమన్ టార్గెట్ చేశాడు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ప్రస్తుతం థమన్ ఈ స్థాయిలో ఉండటంకు కారణం ఎవరో గుర్తు తెచ్చుకోవాలంటూ గతం గుర్తు చేస్తున్నారు.

మహేష్ బాబు దూకుడు సినిమాకు సంగీతాన్ని అందించక ముందు థమన్ ఎక్కడ ఉండే వాడు.. ఆ సినిమా చేయకుంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో థమన్ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. థమన్ కు లైఫ్ ఇచ్చింది ఖచ్చితంగా మహేష్ బాబు అని.. మహేష్ బాబుకు కౌంటర్ వేసే స్థాయి థమన్ కు లేదు అంటూ మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.