Begin typing your search above and press return to search.

చిన్నపిల్లాడిలా టెన్షన్‌ పడ్డ బ్లాక్‌ బస్టర్‌ కంపోజర్‌

By:  Tupaki Desk   |   24 Feb 2020 2:25 PM GMT
చిన్నపిల్లాడిలా టెన్షన్‌ పడ్డ బ్లాక్‌ బస్టర్‌ కంపోజర్‌
X
గత మూడు నెలలుగా ఎక్కడ చూసినా కూడా అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలు ట్రెండ్‌ అవుతున్నాయి. సినిమా ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర థమన్‌ అందించిన పాటలది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్‌ ఇంకా త్రివిక్రమ్‌ లు సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ థమన్‌ దే అంటూ ప్రశంసలు కురిపించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం థమన్‌ క్రేజ్‌ ఆకాశంలో ఉంది. ఆయన ఎంత డిమాండ్‌ చేస్తే అంత ఇచ్చేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. ఆయనతో తమ సినిమాలకు పాటలు ట్యూన్‌ చేయించుకునేందుకు స్టార్‌ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.

అలాంటి థమన్‌ నేడు పవన్‌ కళ్యాణ్‌ ను పింక్‌ రీమేక్‌ సెట్స్‌ లో మీట్‌ అయ్యాడట. సినిమా కోసం తాను ట్యూన్‌ చేసిన పాటను వినిపించేందుకు చాలా నర్వస్‌ అయ్యాడట. ఎంతో కాంగా కలలు కంటున్న వ్యక్తిని కలవడం జరిగింది. నేను ఆయన కోసం మ్యూజిక్‌ చేశాను. టెన్షన్‌ తో ఆయనకు నేను చేసిన ట్యూన్‌ ను వినిపించాను. అతి త్వరలోనే మొదటి పాట మీ ముందుకు వస్తుందంటూ థమన్‌ చిన్న పిల్లాడి మాదిరిగా ఎమోషనల్‌ అయ్యి టెన్షన్‌ పడ్డట్లుగా చెప్పుకొచ్చాడు.

ఏ టెక్నీషియన్‌ కు అయినా ఏ నటుడికి అయినా ఏ నటికి అయినా కూడా పవన్‌ తో ఒక్క సినిమా చేయాలని.. పవన్‌ తో ఒక్క షాట్‌ లో నటించాలని కోరిక ఉంటుంది. థమన్‌ మొదటి సారి పవన్‌ సినిమాకు పని చేసిన నేపథ్యంలో.. ఆయన్ను కలవడంతో ఫ్యాన్‌ మూమెంట్‌ తో పాటు కాస్త టెన్షన్‌ కూడా అయ్యాడు. మొత్తానికి పింక్‌ రీమేక్‌ లో ఉండే ఆ పాటను ది బెస్ట్‌ గా ఇచ్చి పవన్‌ మెప్పు పొందాలని థమన్‌ చాలా తాపత్రయ పడుతున్నాడు.