థమన్ భయ్యా క్రికెట్ ప్రేమ అలా ఉంది!

Sun Jun 16 2019 19:29:23 GMT+0530 (IST)

Thaman Crazy About Cricket

ఇండియాలో ప్రజలు మూడు విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఒకటి రాజకీయాలు.. రెండు సినిమాలు..మూడు క్రికెట్.   రాజకీయాలు ఎందుకు మొదటి స్థానం అంటే.. అందరూ మాకు రాజకీయాలు ఇష్టం లేదని అంటూనే ఉంటారు కానీ ఎప్పుడూ ఫాలో అయ్యేది మాత్రం రాజకీయాలనే.. చేసేవి కూడా అవే లెండి. సినిమాల ప్రస్తావన రానిదే రోజు గడవదు. ఇక క్రికెట్ సంగతి తెలిసిందే.  భారత దేశానికి మొదటి నుంచి క్రికెట్ లవింగ్ నేషన్ అనే పేరుంది.   మన టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు క్రికెట్ లవర్సే.   అందులో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఉన్నాడు.క్రికెట్ ను ఇష్టపడే మిగతా సెలబ్రిటీలకు థమన్ కు ఉన్న తేడా ఏంటంటే.. మిగతావాళ్ళు జస్ట్ క్రికెట్ మ్యాచ్ లు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారేమో కానీ థమన్ భయ్యా మాత్రం మ్యాచులు చూడడంతో పాటు ఆడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడతాడు.  తన వర్క్ పూర్తయిన తర్వాత రాత్రి పూట క్రికెట్ ఆడుతూ ఉంటాడట.  తన ఫ్రెండ్స్ లో సాయి ధరమ్ తేజ్.. ప్రిన్స్ లాంటి వారు ఉన్నారు.  ఈ గ్యాంగ్ అందరూ కలిసి ఒక గ్రౌండ్ ను బుక్ చేసుకొని ఈమధ్యే ఒక T20 మ్యాచ్ ఆడారట.  ఈ మ్యాచ్ లో థమన్ 94 పరుగులు చేసి తన టీమ్ ను గెలిపించాడట.

ఈ మ్యాచే కాదు పోయిన నెలలో సౌత్ ఆఫ్రికాలో ఒక క్రికెట్ టోర్నమెంట్ జరిగిందట. ఈ టోర్నీలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ తల్వార్స్ అనే టీమ్ అక్కడకు వెళ్లిందని.. ఆ బృందంలో మన థమన్ కూడా ఒక సభ్యుడని సమాచారం. అక్కడ ఒక మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడట. ఈ టోర్నీలో సాయి ధరమ్.. సందీప్ కిషన్.. నిఖిల్.. ప్రిన్స్ అందరూ కూడా పాల్గొన్నారట.