Begin typing your search above and press return to search.
థమన్ హవా మామూలుగా లేదుగా!
By: Tupaki Desk | 13 Dec 2019 1:30 AM GMTసంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఈమధ్య సూపర్ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో మంచి హిట్లతో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నప్పటికీ ఒక దశలో రొటీన్ మ్యూజిక్.. కాపీ ట్యూన్స్ అంటూ థమన్ పై విమర్శలు వచ్చాయి. అయితే మధ్యలో కొంతకాలం గ్యాప్ తీసుకున్న థమన్ ఒక ఏడాది నుంచి మంచి ఫామ్ లోకి వచ్చాడు. 'తొలిప్రేమ' లాంటి చార్ట్ బస్టర్ ఆల్బం తో ఒక్క సారిగా తనను తాను ఋజువు చేసుకున్న థమన్ ఇప్పుడు కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడని అంటున్నారు.
ముఖ్యంగా థమన్ పాటలపై.. నేపథ్య సంగీతం ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే 'అల వైకుంఠపురములో' నుంచి మూడు పాటలు విడుదలైతే రెండు పాటలు యూట్యూబ్ రికార్డుల దుమ్ము దులుపుతున్నాయి. ఇక థమన్ సంగీతం అందించిన 'వెంకీమామ'.. 'డిస్కోరాజా' ట్రైలర్లు సాంగ్స్ కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన 'అల వైకుంఠపురములో' టీజర్ కు భారీ స్పందన దక్కుతోంది. ఈ టీజర్ లో థమన్ నేపథ్య సంగీతం ఒక హైలైట్ అని అంటున్నారు.
ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ లో నెంబర్ వాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చాలాకాలం నుంచి కొనసాగుతున్న దేవీ శ్రీ ప్రసాద్ స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాడని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తగ్గట్టే దేవీ కూడా టాప్ క్వాలిటీ ఇవ్వలేకపోతుండడంతో చాలామంది మేకర్స్ థమన్ వైపు చూస్తున్నారని అంటున్నారు. మరి థమన్ ఇదే క్వాలిటీ కొనసాగిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.