Begin typing your search above and press return to search.

నో ట‌చింగ్ అన్నందుకు హాటీపై హీరో ఫ్యాన్స్ ఫైర్

By:  Tupaki Desk   |   9 April 2020 4:15 AM GMT
నో ట‌చింగ్ అన్నందుకు హాటీపై హీరో ఫ్యాన్స్ ఫైర్
X
వేడెక్కించే అందాల‌తో కుర్ర‌కారు గుండెల్ని చిద్రం చేసిన అమ్మ‌డు కిర‌ణ్ రాధోడ్ గుర్తుంది క‌దా! విక్రమ్ కథానాయికగా నటించిన `జెమిని` చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టింది. అదే సినిమా తెలుగనువాదంతో ఇక్క‌డా వేడెక్కించింది. ఆ తరువాత త‌ళా అజిత్ సరసన `విలన్` .. కమల్ హాసన్ `అన్బే శివం` చిత్రాల్లో న‌టించింది. మ‌త్తెక్కించే హొయ‌లుతో యూత్ ని మైమ‌రిపించింది. ఇటీవల ఆమె సుందర్ సి తెర‌కెక్కించిన `ముతినా కత్తిరిక్కై` లోనూ నటించింది. ఇక ఇటీవ‌ల ఈ ఏజ్ బార్ బ్యూటీకి ఆఫ‌ర్లు త‌గ్గిపోవ‌డంతో సోషల్ మీడియాలో నిరంత‌రం హీటెక్కించే వీడియోలతో చెల‌రేగుతోంది.

ప్ర‌స్తుతం క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో కిర‌ణ్ రాథోడ్ పోస్ట్ చేసిన ఓ వీడియో యూత్ లో క‌ల‌క‌లం రేపింద‌నే చెప్పాలి. మ‌నుషులు సామాజిక దూరం పాటించాల‌న్న‌ అవగాహనను పెంచే వీడియోను పోస్ట్ చేసింది. `తిరుమలై` అనే చిత్రంలో ద‌ళ‌పతి విజయ్ తో కలిసి `వాడియమ్మ జక్కమ్మ` అనే స్పెష‌ల్ నంబర్ లో ఐటమ్ క్లిప్ ని షేర్ చేసి.. దానికి వేడెక్కించే వ్యాఖ్య‌ను జోడించింది. ``హత్తుకోవడానికి నోనో.. సామాజిక దూరాన్ని ఉంచండి`` అంటూ టీజ్ చేసే క్యాప్షన్ ఇచ్చింది.

కిరణ్ ఆ వీడియోని పోస్ట్ చేయ‌గానే యూత్ లైక్ లు షేర్ ల‌తో హీటెక్కించారు. ఇక త‌న‌ టైమ్ లైన్ లో ద‌ళ‌ప‌తి విజ‌య్ అభిమానులు మాత్రం టూమ‌చ్ గా సీరియ‌స్ అవుతున్నారు. అయితే త‌న‌పై కోపంగా వ్యాఖ్యల్ని పోస్ట్ చేస్తున్న ద‌ళ‌పతి అభిమానులను కిర‌ణ్ లైట్ తీస్కుంది. ఏదైమైనా ఈ అమ్మ‌డు క‌రోనా నేప‌థ్యంలో.. సామాజిక దూరం ప్రాముఖ్యత పై అవగాహన పెంచేందుకు చేసిన ప్ర‌య‌త్నంపై ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపించారు.