తలైవికి ఆంధ్రా సొగ్గాడు దొరికేసాడు

Mon Feb 17 2020 11:15:13 GMT+0530 (IST)

Thalaivi: This Hero Acts As Shoban Babu's Role!

దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ `తలైవి` టైటిల్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ. ఎల్ విజయ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి భాగస్వాములతో కలిసి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలుగు-తమిళం-హిందీలో రిలీజయ్యే ఈ సినిమా కోసం భారీ కాస్టింగ్ ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.వెండితెర కథానాయికగా...రాజకీయ నాయకురాలిగా అమ్మ జీవితంలో ఎంతో మంది కీలక వ్యక్తులున్నారు. ఆ పాత్రలన్నింటికి విజయ్ నటవిదూషకుల్ని ఎంపిక చేసుకుని దృశ్య రూపం ఇస్తున్నారు. ఇప్పటికే అమ్మ పాత్రలో కంగనా రనౌత్ ఆహార్యం ఎలా ఉండనుందో తెలిపే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నాయకురాలిగా ప్రోస్థటిక్స్ మేకప్ కి సంబంధించిన గెటప్ పై విమర్శలు వచ్చాయి. దీంతో మార్పులు..చేర్పులతో చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక జయలలితతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన లెజెండరీ నటుడు ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే ఎంజీఆర్ ఆహార్యంతో ఉన్న అరవింద్ స్వామి ఫోటోలను యూనిట్ రివీల్ చేసింది. ఎంజీఆర్ కు అచ్చు గుద్దునట్లే ఆ పాత్రలో ఒదిగిపోయాడు స్వామి. కంగన ఆహార్యంపై సర్వత్రా విమర్శలొచ్చినా..అరవింద్ స్వామి మాత్రం పక్కాగా యాప్ట్ అయ్యాడంటూ ప్రశంసలు కురిసాయి. ఇక అమ్మ జీవితంలో మరో కీలక నటుడు.. నట భూషణ్ శోభన్ బాబు. ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. అమ్మకి అత్యంత ఆప్తుడుగా కోలీవుడ్ సహా టాలీవుడ్ మీడియాలోనూ నేటికి హాట్ టాపిక్. ఆ పాత్ర కోసం విజయ్ చాలా మంది నటులను కొన్ని నెలులుగా వెతుకుతూనే ఉన్నాడు. కానీ శోభన్ బాబు రూపురేఖలతో ఒదిగిపోయే సరైన నటుడు దొరక్కపోవడంతో ఎంపిక ఆలస్యమైంది.

ఆ మధ్య రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది. కానీ దర్శకుడు ఆ సాహసం చేయలేదు. తాజాగా ఆ పాత్రకు బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తాని ఎంపిక చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో జిషు టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. అందులో ఎల్. వి. ప్రసాద్ పాత్రలో కనిపించారు. ఇటీవలే అశ్వథ్థామ చిత్రంలో సైకో పాత్రలోనూ నటించాడు. తాజాగా అమ్మ బయోపిక్ లో కీలక పాత్ర అయిన శోభన్ బాబు రోల్ కు ఎంపిక చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జిషు ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించిన ప్రీప్రిపరేషన్స్ కూడా మొదలు పెట్టాడుట. శోభన్ బాబు సినిమాలు చూస్తూ ఆపాత్రలో ఆత్మను పట్టుకునే దిశగా ప్రిపరేషన్ సాగించాడట. జిషు లుక్ ఆంధ్రా సొగ్గాడు పాత్రలో అచ్చు గుద్దినట్లే ఉంటాడని దర్శకనిర్మాతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది.