'అమ్మ' వర్ధంతి సందర్భంగా 'తలైవి' వర్కింగ్ స్టిల్స్..!

Sat Dec 05 2020 13:06:02 GMT+0530 (IST)

Thalaivi Movie Working Stills

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి - ది రివల్యూషనరీ లీడర్' లో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. నేడు(శనివారం డిసెంబరు 5) జయలలిత నాల్గవ వర్ధంతి సందర్భంగా 'తలైవి' బయోపిక్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను కంగనా సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్ట్ చేశారు. కంగనా షేర్ చేసిన వర్కింగ్ స్టిల్స్ లో 'తలైవి' గెటప్ లో కంగన ఆకట్టుకుంటోంది. ఒక ఫొటోలో కంగనా ఠీవిగా నడుస్తూ కనిపిస్తుండగా.. మరో దాంట్లో హాస్టల్ లో భోజనం చేస్తున్న చిన్నారులకు కరచాలనం అందిస్తూ ఉంది.ఈ సందర్భంగా కంగనా రనౌత్ దివంగత జయలలిత కు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. మరో వారం రోజుల్లో సినిమా పూర్తికానుందని.. సూపర్ హ్యూమన్ లా సినిమాను తెరకెక్కిస్తున్న విజయ్ తోపాటు 'తలైవి: చిత్ర యూనిట్ కి ప్రత్యేక ధన్యవాదాలు అని కంగనా ట్వీట్ లో పేర్కొన్నారు. కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి - ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు ఇందూరి - శైలేష్ ఆర్ సింగ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హితేష్ ఠక్కర్ - తిరుమల్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలను శరవేంగా పూర్తి చేస్తున్నారు. 'తలైవి' చిత్రాన్ని తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్నారు.