దేవరకొండ ఆ స్టార్ వీరాభిమాని

Wed Oct 16 2019 16:56:20 GMT+0530 (IST)

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈయన హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఒక వైపు హీరోగా నటిస్తూ మరో వైపు నిర్మాతగా ఒక సినిమాను నిర్మిస్తున్న విజయ్ దేవరకొండ హాలీవుడ్ మూవీ 'టర్మినేటర్ : డార్క్ ఫేట్' అనే చిత్రంను ప్రమోట్ చేస్తున్నాడు. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ మరియు లిండా హెమిల్టన్ లు కీలక పాత్రల్లో నటించిన టర్మినేటర్ : డార్క్ ఫేట్ చిత్రం నవంబర్ 1న ఇండియాలో పలు భాషల్లో విడుదల కాబోతుంది.తెలుగులో ఈ సినిమా ప్రమోషన్ కోసం ట్రైలర్ ను విజయ్ దేవరకొండతో విడుదల చేయించారు. విజయ్ దేవరకొండ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ పై ఉన్న అభిమానంతో టర్మినేటర్ : డార్క్ ఫేట్ ట్రైలర్ ను విడుదల చేశాడు. ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ చిన్నతనంలో ఆర్నాల్డ్ యాక్షన్ సినిమాలు చూసేవాడిని. ది టర్మినేటర్ సినిమా తో నా హాలీవుడ్.. యాక్షన్ సినిమాల ప్రస్థానం మొదలైందని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లాడిగా ఉన్న సమయంలో ఆ సినిమాలను ఎంతో ప్రేమగా చూసేవాడిని. టర్మినేటర్ సిరీస్ లో 6వ భాగంగా వస్తున్న టర్మినేటర్ : డార్క్ ఫేట్ కు ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది.

విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన టర్మినేటర్ : డార్క్ ఫేట్ ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం ఇండియన్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంతో రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రాంతి మాధవ్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.