Begin typing your search above and press return to search.

ప‌దేళ్లు అద్భుత ప్ర‌యాణం.. 'బ‌న్ని-స్నేహ' జంట‌ సెల‌బ్రేష‌న్!

By:  Tupaki Desk   |   6 March 2021 11:30 AM GMT
ప‌దేళ్లు అద్భుత ప్ర‌యాణం.. బ‌న్ని-స్నేహ జంట‌ సెల‌బ్రేష‌న్!
X
స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లాడారు బ‌న్ని. పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ వివాహమిద‌ని చెప్ప‌వ‌చ్చు. ముచ్చ‌టైన‌ ఈ జంట‌కు ఇద్ద‌రు. అల్లు అయాన్.. అల్లు అర్హ‌... చూస్తుండ‌గానే పెరిగి పెద్ద‌వాళ్ల‌యిపోతున్నారు. నిరంత‌రం త‌న కిడ్స్ అల్ల‌రి వేషాల్ని బ‌న్ని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తూ అభిమానుల‌ను హ్యాపీగా ఉంచుతారు.

నేడు (6 మార్చి) ఈ జంట ప‌ద‌వ వివాహ‌వార్షికోత్స‌వం జ‌రుపుకుంటోంది.శనివారం ఉదయం నుండి #AlluArjun అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. దీన్ని క్లిక్ చేసిన చాలా మందికి ఇది అల్లు అర్జున్ .. -స్నేహ జంట‌ వివాహ వార్షికోత్సవం అని అర్థ‌మైంది. ఈ సంద‌ర్భంగా స్టైలిష్ స్టార్ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో శుభాకాంక్షలు తెలిపారు.``క్యూటీ.. అందమైన ప‌దో వార్షికోత్సవం.. పదేళ్లు ఎంతటి అద్భుతమైన ప్రయాణం..మెనీ మోర్ క‌మింగ్`` అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

ఈ వ్యాఖ్య‌తో పాటు రెండు ఫోటోల్ని బ‌న్ని షేర్ చేశారు. ఒక‌టి స్నేహ మెడ‌లో మూడు ముడులు వేస్తున్న ఫోటో. ఇంకొక‌టి త‌మ ప్రేమ‌కు తాజ్ మ‌హ‌ల్ సాక్ష్యంగా ఉంద‌ని నిరూపించేది. బ‌న్ని ప్ర‌స్తుతం పుష్ప చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నా పెళ్లి రోజును మ‌ర్చిపోకుండా అభిమానుల‌తో ఇలా షేర్ చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రం.