తెలుగు 'వెబ్ సిరీస్'లకు దక్కని ఆదరణ.. కారణం అదేనా..??

Fri Jun 18 2021 08:00:01 GMT+0530 (IST)

Telugu web series deserves popularity

దేశంలో డిజిటల్ ప్లాట్ ఫాములకు ఆదరణ పెరగడంతో వెబ్ కంటెంట్ కూడా తెరమీదకు తీసుకొస్తున్నారు మేకర్స్. కరోనా ప్రభావానికి ముందు ఓటిటిలకు పెద్దగా ఆదరణ లేదు. కేవలం థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలు థియేటర్లో నుండి వెళ్ళిపోయాక కొద్దీ రోజులకు ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యేవి. కానీ కరోనా వచ్చాక సినీ ఇండస్ట్రీలో పరిస్థితి తారుమారు అయింది. ఎందుకంటే థియేట్రికల్ రిలీజ్ అయ్యే సినిమాలకంటే కూడా ఇప్పుడు ప్రేక్షకులు ఓటిటి కంటెంట్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎలాగో ఇంతకాలం థియేటర్స్ మూతపడి ఉండేసరికి సినీ ప్రేక్షకులు కూడా ఓటిటి ప్రేక్షకులుగా మారిపోయారు.

అయితే ఓటిటి ప్రేక్షకులకు తగ్గట్టుగానే ప్రస్తుతం వెబ్ కంటెంట్ మూవీస్ - వెబ్ సిరీస్ కంటెంట్ బాగానే ప్రిపేర్ చేసి సిద్ధం చేస్తున్నారు. వెబ్ సిరీసులు అనేవి ఇదివరకు హిందీలో మాత్రమే ఎక్కువగా రూపొందించేవారు. కానీ అన్ని ఇండస్ట్రీలతో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా వెబ్ సిరీస్ కంటెంట్ కోసం జనాలు డిమాండ్ ఏర్పడింది. తెలుగులో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అండ్ మేకింగ్ అనేది కూడా ఈ మద్యే ఎక్కువగా పుంజుకుంది. కానీ ఇతర భాషల్లో హిట్ అయినట్టుగా తెలుగులో వెబ్ కంటెంట్ సక్సెస్ అవ్వడం లేదు. ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి తెలుగు వెబ్ సిరీసులు సరైన ఆదరణ రాబట్టుకోలేకపోయాయి.

మరి తెలుగులో వెబ్ సిరీసులకు ఆదరణ దక్కకపోవడానికి కారణం ఏంటంటే.. సరైన కాస్టింగ్ లేక దెబ్బతింటున్నాయని సోషల్ మీడియాలో కథనాలు చెబుతున్నాయి. వెబ్ సిరీసులు మాత్రం సినిమాలకు పెట్టినట్లుగానే భారీ బడ్జెట్ పెడుతున్నారు. కానీ కంటెంట్ కు తగిన కాస్ట్ లేక ఫెయిల్ అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వెబ్ సిరీస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని కంటెంట్ తగ్గట్టుగా కాస్టింగ్ ఎంపిక చేసుకుంటే బాగుంటుందని ఓటిటి వర్గాలకు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి తెలుగులో వచ్చిన వెబ్ సిరీసులు ఇప్పటివరకు హైలైట్ కాలేదు. ఇలాగే కంటిన్యూ అయితే వెబ్ సిరీస్ లకు క్రేజ్ తగ్గే అవకాశం ఉంది. మరి ఇకనైనా బడ్జెట్ కాకుండా కాస్టింగ్ పై దృష్టి పెడతారేమో చూడాలి.