నయా ట్రెండ్ స్టార్ట్ చేసిన తెలుగు నిర్మాతలు!

Thu Aug 06 2020 10:30:00 GMT+0530 (IST)

Telugu producers who started a new trend!

ఇరుగు పొరుగు భాషల్లో బెస్ట్ హిట్ సినిమాల్ని ఏరుకొచ్చి తెలుగు ప్రేక్షకులకు అందించడం చాలా కాలంగా చూస్తున్నదే. రీమేక్ లు డబ్బింగులు అంటూ పొరుగు సినిమా మన ఆడియెన్ కి అలవాటైపోయింది. డబ్బింగులపై కట్టడి తెస్తాం! అంటూనే ఇలా చేయడం అందరికీ అలవాటే. ఈ ట్రెండ్ ఇటీవల మరింత ముదిరింది. డిజిటల్లో ఇది సరికొత్త ట్రెండ్ కి దారి తీస్తోందట.ఇటీవలి కాలంలో డబ్బింగుల్ని వ్యతిరేకించేవాళ్లు లేరు. దీంతో అనువాద చిత్రాల సంఖ్య టాలీవుడ్ లో అంతకంతకు పెరుగుతోంది. హిట్లు లేకపోయినా డబ్బింగుల శాతం అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. పాన్ ఇండియా పేరుతో హీరోలంతా ఇరుగు పొరుగు భాషల్లోనూ మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారు. మన నిర్మాతలు ఎంకరేజ్ చేయడమే అందుకు కారణం.

ఇది తెలుగు నిర్మాతలకు ఇటీవల వేరొక రకంగా కలిసొస్తోందట. వేరే భాషలో క్రేజ్ ఉన్న సినిమాల డబ్బింగ్ రైట్స్ తీసుకొని.. వాటిని తెలుగు లోకి డబ్బింగ్ చేయించి... వాటిని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ మాదిరి అమ్మేస్తున్నారట! ఇదే రీతిలో ఇక్కడ పాన్ ఇండియా! అంటూ చెబుతున్న అన్ని సినిమాలను వేరే భాషల్లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. తెలుగు నిర్మాతల్లో ఇదో కొత్త ట్రెండ్ అని కూడా చెబుతున్నారు.

డబ్బింగ్ సినిమాని స్ట్రెయిట్ సినిమా అని చెప్పి ఓటీటీలకు అమ్మేయడం.. పాన్ ఇండియా పేరుతో పొరుగు భాషల్లోకి అనువదించి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడం ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. ఇవన్నీ సరికొత్త బిజినెస్ మార్గాలుగా మారాయన్నమాట!