Begin typing your search above and press return to search.

పూజను వివాహమాడిన తెలుగు డైరెక్టర్

By:  Tupaki Desk   |   1 Feb 2023 3:31 PM GMT
పూజను వివాహమాడిన తెలుగు డైరెక్టర్
X
గతంలో రచయితగా పరిచయమై తర్వాత దర్శకుడుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ హీరోగా పరిచయమై తర్వాతి కాలంలో రచయితగా మారి చివరికి దర్శకుడుగా సెటిలైన వారు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో వెంకి అట్లూరి కూడా ఒకరు. అయితే తాజాగా వెంకి అట్లూరి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. పూజ అనే యువతీని ఆయన వివాహం చేసుకున్నాడు. ఆయన వివాహానికి సంబంధించిన విషయాన్ని హీరో నితిన్ బయటపెట్టాడు.

ప్రస్తుతం నితిన్ ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెంకీ అట్లూరి వివాహానికి హాజరైన నితిన్ తన భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి నూతన వధూవరులతో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెడుతున్న వెంకీ అట్లూరికి కంగ్రాట్స్ తెలిపారు. పూజతో నీ జీవితం మరింత ఆనందంగా ఆనందంగా మారాలని కోరుకుంటున్నాను అంటూ నితిన్ కామెంట్ చేశారు. ఈ ఇద్దరు కలిసి రంగ్‌ దే అనే సినిమా చేశారు.

ఇక వెంకి కెరియర్ విషయానికి వస్తే జ్ఞాపకం అనే సినిమాతో 2010 సంవత్సరంలో ఆయన హీరోగా మారాడు. అయితే హీరోగా ఏమాత్రం గుర్తింపు దక్కకపోవడంతో కొన్నాళ్లపాటు సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత రచనల మీద ఆసక్తితో స్నేహ గీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ వంటి సినిమాలకు రచయితగా పనిచేశారు. 2018లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తొలిప్రేమ అనే సినిమాతో దర్శకుడుగా పరిచయమైన వ్యక్తి వెంకి అట్లూరి.

ఆ తర్వాత కాలంలో నితిన్‌ తో రంగ్‌ దే... అఖిల్ తో మిస్టర్ మజ్నూ అంటే సినిమాలు తెరకెక్కించారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి ధనుష్ తో వాథి అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. తెలుగులో దీన్ని సార్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మహా శివరాత్రి సందర్భంగా సినిమా విడుదల కాబోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.