మరో బుల్లి తెర హీరోకు పాజిటివ్

Sat Jul 04 2020 18:00:41 GMT+0530 (IST)

Telugu TV actor Ravi Krishna tests positive for Dangerous Disease

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చిన వెంటనే సీరియల్స్ షూటింగ్స్ అన్ని ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం ఎన్నో గైడ్ లైన్స్ ఇచ్చి షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చింది. కాని సీరియల్ మేకర్స్ మాత్రం వాటిని ఫాలో అవ్వక పోవడం వల్లో ఏమో కాని చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్స్ వైరస్ బారిన పడుతున్నారు. నటుడు ప్రభాకర్ ఆ తర్వాత మరో నటుడు ఇటీవల నా పేరు మీనాక్షి హీరోయిన్ నవ్య స్వామి వైరస్ బారిన పడ్డారు. తాజాగా సీరియల్ హీరో రవికృష్ణ వైరస్ బారిన పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి.సీరియల్ షూటింగ్ సమయంలోనే ఈయనకు వైరస్ ఎటాక్ అయ్యింది అంటూ ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అయిన రవికి మంచి గుర్తింపు ఉంది. సీరియల్స్ తో పాటు పలు షోల్లో పాల్గొని గుర్తింపు దక్కించుకున్న రవికృష్ణ వైరస్ పాజిటివ్ అంటూ నిర్థారణ రావడంతో పూర్తిగా ఇంటికి పరిమితం అయ్యి జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని త్వరలోనే వైరస్ ను జయించి వస్తానంటూ ధీమాగా సన్నిహితులతో అన్నాడట.

తెలుగు బుల్లి తెరకు చెందిన పలువురు నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ప్రస్తుతం వైరస్ పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని కాని అసలు నెంబర్ మాత్రం చెప్పడం లేదు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే షూటింగ్స్ ను కొన్ని రోజుల పాటు నిలిపేసే అవకాశం లేకపోలేదు అంటూ కూడా కొందరు అంటున్నారు. వైరస్ కు భయపడే సినిమా వారు ఎక్కువగా షూటింగ్ ను మొదలు పెట్టడం లేదు.