స్టార్ హీరోయిన్ పై తెలుగు నిర్మాతలు గుర్రు

Wed Oct 05 2022 09:24:37 GMT+0530 (India Standard Time)

Telugu Producers Pressure On Star Heroine

ఇటీవలే భర్త నుంచి బ్రేకప్ వార్తలతో హాట్ టాపిక్ గా మారిన ఒక అందాల కథానాయిక .. ఆ తర్వాత కెరీర్ పరంగా అమాంతం స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. ఇటు తెలుగు అటు హిందీలో భారీ చిత్రాలకు సంతకాలు చేసింది. బ్యాక్ టు బ్యాక్ నాలుగైదు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.ఊపిరాడని షెడ్యూల్స్ తనకోసం ఎదురు చూస్తున్నాయి. కానీ ఇంతలోనే తాను బిగ్ బ్రేక్ ఇచ్చింది. అనూహ్యంగా అమెరికా వెళ్లిపోయింది. ఏదో చిన్న ట్రిప్ అని అంతా భావించారు. తన రాక కోసం ఇక్కడ తెలుగు నిర్మాతలు ఎంతో ఆత్రంగా వేచి చూసారు. కానీ తన రాక ఆలస్యమవుతోంది. ఈ ఆలస్యం వల్ల తెలుగులో చిత్రీకరణ దశలో ఉన్న మూడు ప్రాజెక్టులు కాస్త ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయన్న గుసగుసా వినిపించింది.

ఇక అమెరికా ట్రిప్ ముగించి తిరిగి పనిలో చేరేందుకు సదరు స్టార్ హీరోయిన్ ఇండియాకి తిరిగి వస్తోందని తాజాగా తీపి కబురందింది. ఇంతకీ సదరు హీరోయిన్ అమెరికా ఎందుకు వెళ్లినట్టు? అంటే.. అప్పటికే కమిటైన భారీ హిందీ వెబ్ సిరీస్ ని పూర్తి చేసేందుకు తను యుఎస్ కి వెళ్లింది. ఇప్పుడు అక్కడ చిత్రీకరణ ముగించి తన కోసం ఎదురు చూస్తున్న తెలుగు నిర్మాతల కోసం ఇక్కడ అడుగు పెట్టనుందిట. మరో రెండు వారాల్లోనే తాను హైదరాబాద్ కి తిరిగి రానుందని సమాచారం.

ఓవైపు తెలుగు నిర్మాతలు తమ సినిమాలను శరవేగంగా పూర్తి చేసి త్వరగా థియేటర్లలో విడుదల చేయాలని తహతహలాడుతున్నారు. కానీ దానికి సదరు హీరోయిన్ బిజీ షెడ్యూల్స్ సహకరించడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

ఏది ఏమైనా అమెరికా షెడ్యూల్ ని ముగించిన సదరు స్టార్ హీరోయిన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూడు తెలుగు సినిమాల పనుల్ని ముగించాల్సి ఉంటుంది. ఒక సినిమా షూటింగ్ చేస్తూనే సాయంత్రం వేళల్లో రిలీజ్ లకు రెడీ అవుతున్న ఇతర సినిమాలను ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఇక పోతే మరో రెండు వారాల్లో తను హైదరాబాద్ కి వస్తుందని వెంటనే మూవీ షూట్ కు అందుబాటులో ఉంటుందని సదరు నటి బృందం ఇప్పుడు స్పష్టం చేసింది.

ఇక అమెరికా ట్రిప్ నుంచి సదరు స్టార్ హీరోయిన్ సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి అప్ డేట్స్ అందించకపోవడంతో అందరూ కంగారుగా ఉన్నారు. నిరంతరం ఇన్ స్టా వేదికగా ఏదో ఒక సమాచారం అందించే సదరు నాయిక గప్ చుప్ గా ఉండడం కంగారు పెడుతోంది. తాను రావడం ఆలస్యమవుతుందా? అన్న కన్ఫ్యూజన్ లోనూ నిర్మాతలు ఉన్నారు. ఏది ఏమైనా తాను ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం తిరిగి వచ్చి ఇక్కడ మూడు సినిమాల పనుల్ని సవ్యంగా చక్కబెడుతుందనే భావిస్తున్నారు. ఆసక్తికరంగా సదరు స్టార్ హీరోయిన్ బాలీవుడ్ లో వరుసపెట్టి సంతకాలు చేసింది. వాటన్నిటికీ ఇప్పుడు కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తెలుగు నిర్మాతల సన్నివేశం ఎలా ఉంటుందోనని గుసగుస వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.