వైష్ణవ్ తేజ్ కోసం తెలుగు బ్యూటీ ఫిక్స్

Mon Jan 21 2019 10:17:18 GMT+0530 (IST)

మెగా ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నాడన్న సంగతి తెలిసిందే. రెండో మెగామేనల్లుడు.. సుప్రీమ్ సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా లాంచ్ ఈరోజే  ప్లాన్ చేశారు. ఈ సినిమాకు టాప్ లీగ్ టెక్నిషియన్లను సెట్ చేశారు నిర్మాతలు.  తాజాగా ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ తో రొమాన్స్ చేయబోయే హీరోయిన్ పేరు కూడా బయటకు వచ్చింది.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారట. ఆ అమ్మాయి పేరు మనీషా రాజ్ అని.. తను ఒక ఎన్నారై అని సమాచారం.  ఈ సినిమా ఒక రియలిస్టిక్ టచ్ ఉండే ఇంటెన్స్ లవ్ స్టొరీ అని.. హీరో హీరోయిన్ల పాత్రలు స్ట్రాంగ్ గా ఉండడంతో హీరోయిన్ కోసం ఎంతో కసరత్తు చేసిమరీ ఫైనలైజ్ చేశారని అంటున్నారు.   తెలుగు సినిమాలలో తెలుగమ్మాయిలు ఉండరు అని ఎప్పుడూ సణుగుతూ ఉండే తెలుగు సినీ అభిమానులకు ఇది కాస్త ఊరట నిచ్చే అంశమే.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారు.