తెరమీదకు తెలుగు గ్లామరస్ యాంకర్స్ వెబ్ సిరీస్..??

Mon Jun 14 2021 12:14:40 GMT+0530 (IST)

Telugu Glamorous Anchors Web Series on screen .. ??

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ టీవీ యాంకర్స్ దగ్గరనుండి సినిమా యాక్టర్స్ వరకు అందరికి అభయహస్తం అయిపోయింది. ఎందుకంటే ఇదివరకు యాక్టర్స్ అంటే సినిమాలకు.. యాంకర్స్ అంటే టీవీ ప్రోగ్రాంస్ వరకే కనిపించేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం టీవీ యాంకర్స్ కూడా హీరోలు - హీరోయిన్స్ అయిపోతున్నారు. కొందరు హీరోయిన్స్ గా కాకపోయినా నటులుగా ప్రూవ్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటిటిలు వచ్చినప్పటి నుండి యాంకర్స్ కూడా సినిమాలు వెబ్ సిరీస్ లలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అయితే టీవీ ప్రోగ్రాంస్ యాంకరింగ్ లో కూడా గ్లామర్ ఒలికించే యాంకర్స్ ఉన్నారు. టాలీవుడ్ గ్లామరస్ యాంకర్స్ లిస్టులో అనసూయ - రష్మీ ముందు వరుసలో ఉండగా.. వారి తర్వాత అంతలా ఆకట్టుకునే గ్లామర్ యాంకర్ వర్షిణి కలిగి ఉంది. అయితే వీరు ఎవరికీ వారే కెరీర్ పరంగా సినిమాలు ప్రోగ్రాంస్ చేసుకుంటూనే ఉన్నారు. ఆల్రెడీ అనసూయ సినీనటిగా ఫేవరేట్ లిస్టులో చేరింది. ఇంకా రష్మీ గౌతమ్ గురించి చెప్పే అవసరం లేదు. కుర్రకారుకు అందాల ట్రీట్ ఇవ్వడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. వర్షిణి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేందుకు సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ ముగ్గురు వయ్యారి భామలను ఒకే తెరపై చూసే అవకాశం రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ మల్లెమాల యాజమాన్యం రష్మీ - అనసూయ - వర్షిణిలను ప్రధానపాత్రల్లో ఓ ఇంటరెస్టింగ్ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఆ వెబ్ సిరీస్ కూడా నేరుగా ఈ బ్యూటీల యూట్యూబ్ ఛానల్స్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ ఈ ముగ్గురు భామలు టాలీవుడ్ హీరోయిన్స్ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. మరి ఈ లెక్కన వెబ్ సిరీస్ అనేది ఏ రేంజిలో ప్రేక్షకులలోకి దూసుకెళ్తుందో వెయిట్ అండ్ సి. అయితే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మరి అందాల తారలు ఆ సిరీస్ కు ప్లస్ అవుతారా లేక ఆ సిరీస్ వీరికి ప్లస్ అవుతుందా వేచి చూడాలి.