Begin typing your search above and press return to search.

పెళ్లి కాని బ్యూటీతో పెళ్ల‌యిన ద‌ర్శ‌కుడలా!

By:  Tupaki Desk   |   1 Aug 2020 11:30 PM GMT
పెళ్లి కాని బ్యూటీతో పెళ్ల‌యిన ద‌ర్శ‌కుడలా!
X
పెళ్ల‌యిన 44 ఏళ్ల ఆవిడ‌తో 32 ఏళ్ల ఆ యంగ్ హీరో ల‌వ్వాయ‌ణం ముంబై ప‌రిశ్ర‌మ‌ను హీటెక్కిస్తోంది. అయితే అలాంటివి బాలీవుడ్ లో కొత్తేమీ కాదు కానీ.. అచ్చంగా ఇలాంటివే టాలీవుడ్ లో కూడా వినిపిస్తే అటుపై గాసిప్ రాయుళ్లు మెంటెల‌క్కించ‌రూ?

కానీ 45 ప్ల‌స్ ద‌ర్శ‌కుడితో 33 ఏజ్ హీరోయిన్ ఎఫైర్ ప్ర‌స్తుతం టాలీవుడ్ స‌ర్కిల్స్ లో క‌థ‌లు క‌థ‌లుగా వైర‌ల్ అవుతూనే ఉంది. వారు ఖండించినా ప‌దే ప‌దే రూమ‌ర్లు స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. వ్యాపార భాగ‌స్వామిగానో లేక నిర్మాణ భాగ‌స్వామిగానో కొన‌సాగ‌డం త‌ప్పేమీ కాదు కానీ.. మ‌రీ సందేహాలు క‌లిగేలా వ్య‌వ‌హ‌రిస్తేనే ఇలాంటి గాసిప్పులు షికార్ చేస్తుంటాయి. తాజాగా పెళ్లికాని ఆమె‌తో వివాహితుడైన‌ దర్శకుడి ఎఫైర్ అంటూ ఒక‌టే ప్ర‌చారం హీటెక్కిస్తోంది. క్వారంటైన్ అలా క‌లిసొచ్చిందంటూ పుకార్ షికార్ చేస్తోంది.

హైద‌రాబాద్ టు ముంబై ప్ర‌స్తుతం ఇదో హాట్ టాపిక్ గా మారింది. కెరీర్ ప‌రంగా కంబ్యాక్ అవ్వాల‌న్న త‌ప‌న ఒక‌వైపు.. పోగొట్టుకున్న చోటే రాబ‌ట్టుకోవాల‌న్న పంతం ఇంకోవైపు. ఈ హోరాహోరీ న‌డుమ కెరీర్ ప‌రుగులో భాగంగా ముంబై ప్ర‌యాణాలు.. విదేశీ ప్ర‌యాణాలు.. వెర‌సి ఆ జంట‌ను నీడ‌లాగా వెంటాడే వాళ్లే ఎక్కువ‌. ప్ర‌స్తుతం ఈ జంట ముంబైలో ఉంటోంది. క‌లిసే ఉంటారు. క‌లిసే వ్యాయామం చేస్తారు. యోగా ధ్యానం తో సాంత్వ‌న పొందుతారు. తీరిక స‌మ‌యంలో ల‌వ్ స్టోరీని కొనసాగిస్తున్నారు అంటూ ఒక‌టే ఠాంఠాం మోగుతోంది. అయితే ఇందులో ఏది నిజం? ఎంత వాస్త‌వం? అంటే చూసే క‌ళ్ల‌ను వినే చెవుల‌ను బ‌ట్టి మారుతుంటుంది.