దారుణంగా మోసపోయిన హీరో.. న్యాయం కోసం పోలీసుల వద్దకు..

Sun Jun 26 2022 10:08:22 GMT+0530 (IST)

Telugu Actor Sai Kiran

సినిమాల్లో నటించాక భారీగానే సొమ్ము వస్తుంటుంది. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే భవిష్యత్ బాగుంటుంది. ఎవరినో నమ్మి అప్పులు ఇస్తే 'పూరి జగన్నాథ్'లా నిండా మునగాల్సి వస్తుంది. పూరి కూడా స్నేహితులు అని నమ్మి వారికి డబ్బులు ఇచ్చి మోసపోయానని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు మరో హీరో కూడా అలానే మోసపోయాడు.'నువ్వే కావాలి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయికిరణ్ గురించి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ నటుడు ప్రస్తుతం పలు సీరియల్స్ లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. తాజాగా ఇతడు తాను దారుణంగా మోసపోయినట్లు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. తన దగ్గర అప్పు తీసుకొని మోసం చేశారంటూ సాయికిరణ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. అప్పు తీసుకోవడమే కాకుండా తనపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. సాయికిరణ్ నాలుగు రోజుల కిందటే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నిర్మాత జాన్ బాబు లివింగ్ స్టన్ లు తన వద్ద రూ.1060000 అప్పుగా తీసుకొని మోసం చేశారని.. తనకు న్యాయం చేయాలంటూ సాయికిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు అడిగితే తనను బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

సాయికిరణ్ ఫిర్యాదు మేరకు జాన్ బాబు లివింగ్ స్టన్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. వారిపై 420406 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

సినీ ఇండస్ట్రీలో ఇలా డబ్బులను తెలిసిన వారికి స్నేహితులకు అని ఇవ్వడం.. వారు సినిమాల్లో పెట్టి నిండా మునగడం.. అనంతరం ఇవ్వకపోవడం తరచుగా జరుగుతుంటుంది. చాలా మంది వివాదాలు ఎందుకు అని గమ్మున ఉంటుండగా.. కొందరు పోలీసుల గడప తొక్కుతున్నారు.