Begin typing your search above and press return to search.

హీటు పెంచేస్తున్న ఐస్ ‌క్రీమ్ పాప‌

By:  Tupaki Desk   |   25 Sep 2021 3:30 AM GMT
హీటు పెంచేస్తున్న ఐస్ ‌క్రీమ్ పాప‌
X
రామ్ ‌గోపాల్‌ వ‌ర్మ `ఐస్ క్రిమ్‌` మూవీతో హీరోయిన్‌ గా ఒక్క‌సారిగా వార్త‌ల్లో నిలిచింది తేజ‌స్వీ మ‌దివాడ‌. హీరోయిన్ ‌గా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రంలోనే త‌న లే లేత ప‌రువాల‌తో థై షోకు తెర‌లేపిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపుని... ఆఫ‌ర్ల‌నీ ద‌క్కించుకోలేక‌పోతోంది. కావాల్సిన గ్లామ‌ర్‌.. న‌ట‌న వున్నా ఎక్క‌డా రాణించ‌లేక‌పోతోంది. వ‌ర్మ `ఐస్ క్రీమ్‌` త‌న కెరీర్‌కి బూస్ట్‌ నిచ్చినా ఆ క్రేజ్‌ ని ఎక్కువ కాలం నిలుపుకోలేక‌పోయింది.

బాబు బాగా బిజీ.. క‌మిట్‌మెంట్ వంటి అడ‌ల్ట్ కామెడీ.. ఓవ‌ర్ డోస్ గ్లామ‌ర్ సీన్స్ వున్న చిత్రాల్లో న‌టించినా తేజుకు పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింది. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌ల కోసం ఎదురుచూస్తున్న తేజ‌స్వీ రోజుకో హాట్ పిక్‌తో ఇన్‌స్టాని హీటెక్కించేస్తోంది. ఇటీవ‌ల పాస్ ఫొటో అంటూ బ్లాక్ సారీలో ప‌రువాల్ని ప‌రిచేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.

క‌త్తిలా వున్నావు తేజు అని కొంత మంది.. పోయి నీ ముఖం అద్దంలో చూసుకో అని కొంత మంది .. హాట్ సెక్సీ లుకింగ్ అని కొంత మంది.. సో సెక్సీ.. అని టూ హాట్ ఇన్ బ్లాక్ అని కామెంట్‌ల వ‌ర్షం కురిపించారు. ఇదిలా వుంటే తాజాగా ఓ త్రోబ్యాక్ ఫొటోని తేజు షేర్ చేసింది. మోకాళ్ల‌పై కూర్చుని బ్లేజ‌ర్ బ‌ట‌న్స్ విప్లేసి అందాల విందు చేస్తున్న ఈ భంగిమ‌ని మ‌ళ్లీ ట్రై చేయ‌లేనంటూ ఆ ఫొటోకి క్యాప్ష‌న్ ఇచ్చింది. ప‌దివేల పైచిలుకు మంది ఈ ఫొటోని లైక్ చేస్తే చాలా త‌క్కువ మంది కామెంట్ చేశారు.