తేజస్వి అలా చూసి గుబులు పెంచేయకు..!

Tue May 04 2021 06:00:01 GMT+0530 (IST)

Tejaswi Madivada Latest Photo

ఐస్ క్రీమ్ ఫేం తేజస్వి మాదివాడ  కెరీర్ జర్నీ తెలిసిందే. బిగ్ బాస్ -తెలుగు సీజన్ లో కనిపించాక పెరిగిన పాపులారిటీతో తేజస్వి వరుస చిత్రాలకు సంతకాలు చేసింది. కానీ ఎందుకనో కొన్ని సినిమాల రిలీజ్  లు అంతకంతకు ఆలస్యమవుతున్నాయి. ఇటీవల `కమిట్ మెంట్` అనే చిత్రంలో తేజస్వి బోల్డ్ ఎటెంప్ట్ గురించి ఆసక్తికర చర్చ సాగినా ఆ మూవీ కి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ లేనే లేదు.సినీపరిశ్రమలో కమిట్ మెంట్లు వేధింపుల నేపథ్యంలో చిత్రమిది. ఇదివరకూ రిలీజ్ చేసిన తేజస్వి హాట్ పోస్టర్ కి అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఇందులో కమిట్ మెంట్ కి మొహమాటపడని అమ్మాయిగా తేజస్వి వేడెక్కిస్తుందన్న ప్రచారం సాగింది. మహమ్మారీ వల్లనో ఏమో కానీ ఈ మూవీ రిలీజ్ అంతకంతకు ఆలస్యమవుతోంది.

ఇక సోషల్ మీడియాల్లోనూ వైల్డ్ గా దూసుకెళుతున్న ఈ తెలుగమ్మాయ్ లేటెస్ట్ ఫోటోషూట్లు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఫ్లోరల్ డిజైనర్ ఫ్రాకులో గుబులు పెంచేసింది ఈ బ్యూటీ. స్టూడియో బ్యాక్ గ్రౌండ్ లో ఫోటో ఫ్రేమ్ ల నడుమ తేజస్వి ఫోజులు ఎంతో ఆకర్షిస్తున్నాయి. అలా వీపందం ప్రదర్శిస్తూనే ఎద సొంపుల్ని ఎలివేట్ చేస్తున్న ఈ ఫోటో కుర్రకారులో వైరల్ గా దూసుకెళుతోంది.