సెగలు పుట్టిస్తున్న తెలుగమ్మాయి సొగసులు...!

Sun Jul 05 2020 20:23:08 GMT+0530 (IST)

Tejaswi Madivada Glamourous Pose

'బిగ్ బాస్' బ్యూటీ తేజస్వి మదివాడ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేదు. సిల్వర్ స్క్రీన్ పై క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తేజస్వి.. ఆ తరవాత రోజుల్లో హీరోయిన్ గా మారింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' 'మనం' 'హార్ట్ ఎటాక్' 'కేరింత' 'ఐస్ క్రీమ్' 'జత కలిసే' సినిమాల్లో నటించి హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే 'బిగ్ బాస్' రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా బాగా పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు. ఈ షో లో గ్లామర్ తో పాటు ఆటపాటలు కోపతాపాలు ఇలా అన్ని ఎమోషన్స్ చూపిస్తూ 'బిగ్ బాస్' హౌస్ లో హీట్ పుట్టించింది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. సమ్మర్ వింటర్ అని తేడాలేకుండా తన ఫొటోలతో కుర్రాళ్లలో వేడిని రాజేస్తూ ఉంటుంది.అందాల ఆరబోతలో బాంబే బ్యూటీస్ కి ఏమాత్రం తక్కువ కాదంటూ హీట్ పెంచే ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. కాగా తేజస్వి ప్రస్తుతం 'కమిట్మెంట్' అనే సినిమాలో నటిస్తోంది. 'హైదరాబాద్ నవాబ్స్' 'పరిచయం' చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ లక్ష్మీకాంత్ చెన్నా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పై లైంగిక వేధింపులతో పాటు పలు రంగాల్లో చోటుచేసుకొంటున్న వేధింపులను కథాంశంగా 'కమిట్మెంట్' రూపొందించారు. ఇక ఈ సినిమా కోసం తేజస్వి అందాల గేట్లు తెరిచేసింది. క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో గ్లామర్ డోస్ పెంచేసింది. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన తేజస్వి లుక్ చూస్తేనే అర్థం అవుతోంది తేజస్వి కమిట్మెంట్ ఏంటో..!

కాగా కమిట్మెంట్ సినిమా కోసం అమ్మడు చేసిన ఫోటో షూట్ ఫోటోలు ఒక్కొక్కటిగా వదులుతూ వస్తోంది. తేజస్వీ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా వాటికి తగ్గట్టుగా క్యాప్షన్ కూడా పెడుతుంది. వేసుకునే దుస్తులతో పాటు అభిప్రాయాన్ని మార్చుకుంటున్నట్లైతే అలాంటి అభిప్రాయం తనకు అవసరం లేదంటోంది. తాజాగా మరో సెగలు పుట్టించే ఓ ఫోటోను షేర్ చేసిన ఈ బ్యూటీ ''జనాలు ఏది చూడాలని అనుకుంటారో అదే చూస్తారు'' అని క్యాప్షన్ పెట్టింది. బాడీ క్రింది భాగంలో వస్త్రాలు ధరించిందో లేదో అనే అనుమానం కలిగేలా కూర్చొని అమ్మడు ఇచ్చిన ఫోజ్ కి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం అని నెట్టింట షేర్ చేసేస్తూ వైరల్ చేసేస్తున్నారు..!