కరోనా అంటే జనాలకు భయం లేదంటూ తిట్టిన తేజకు పాజిటివ్

Mon Aug 03 2020 15:20:38 GMT+0530 (IST)

positive for the vitality that people have no fear of being cursed

సరిగ్గా నెల రోజుల క్రితం దర్శకుడు తేజకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో తేజ మాట్లాడుతూ ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పది వేలు ఇరవై వేలు అన్నట్లుగా ఉంది. మన ఇండియన్స్ యాటిట్యూడ్ కారణంగా ఈ సంఖ్య త్వరలోనే లక్షకు చేరుతుందని అన్నాడు. భారతీయుల ప్రవర్తన అశ్రద్ద వల్ల రోజుకు లక్ష కరోనా కేసులు నమోదు అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించడంతో పాటు జనాలకు జాగ్రత్తలను కూడా ఆ వీడియోలో తేజ చెప్పాడు.ఏదైనా షాప్ కు వెళ్లిన సమయంలో కూరగాయల మార్కెట్ కు వెళ్లినప్పుడు నీవు తీసుకునే ప్రతి వస్తువుకు కరోనా ఉందేమో అని అనుమానించు.. నీవు ఎవరికి డబ్బులు ఇచ్చిన అవతలి వ్యక్తికి కరోనా ఉందేమో అని భయపడు. ఎవరిని కలిసినా అతడికి ఏమైనా కరోనా ఉందేమో అని ఆలోచించి దూరంగా ఉండూ అంటు జనాలకు సూచనలు చేసిన తేజ ఇప్పుడు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయన స్వల్ప అనారోగ్యంతో బాధపడుతుండగా అనుమానంతో కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చిందట.

ఎన్నో జాగ్రత్తలు చెప్పిన దర్శకుడు తేజ గారు ఆయన వాటిని పాటించలేదా లేదంటే ఆయన జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వారు జాగ్రత్తగా లేకపోవడం వల్ల ఆయనకు కరోనా వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన చుట్టు ఉన్న వారు మన కుటుంబ సభ్యులు మనం రెగ్యులర్ గా కాంటాక్ట్ అయ్యే వాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. తేజ తనవంతు జాగ్రత్తలు తీసుకున్నా ఆయన చుట్టు ఉన్న వారు అజాగ్రత్తగా ఉండటం వల్ల కరోనా వచ్చి ఉంటుందేమో. ఏది ఏమైనా ఆయనకు ఎలా పాజిటివ్ వచ్చినా త్వరలోనే ఆయన కోలుకోవాలని ఆయన అభిమానుల తరపున మా తరపున కూడా కోరుకుంటున్నాం.