థియేటర్లలోనే తేజ సజ్జా 'ఇష్క్'.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Tue Jul 20 2021 18:13:51 GMT+0530 (IST)

Teja Sajja Ishq in theaters Release date fixed

'జాంబిరెడ్డి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజా సజ్జా నటించిన తాజా చిత్రం ''ఇష్క్''. 'నాట్ ఏ లవ్ స్టోరీ' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించింది. ఎస్.ఎస్. రాజు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాత్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు ఈ సినిమాతో టాలీవుడ్ లో కంబ్యాక్ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.'ఇష్క్' రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఇచ్చిన చిత్ర యూనిట్.. ఓ పోస్టర్ ని వదిలారు. ఇందులో తేజ సజ్జ - ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ ఉన్నారు. ఇది రొమాంటిక్ పోస్టర్ అయినప్పటికీ.. సినిమా కేవలం రొమాంటిక్ మూవీ మాత్రమే కాదని చిత్ర బృందం చెబుతోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ విజృభిస్తుండటంతో విడుదల వాయిదా వేశారు. ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో ఈ నెల 30న రిలీజ్ చేయడానికి నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దీంతో పాండమిక్ తర్వాత ప్రేక్షకులకు అలరించడానికి వచ్చే థియేటర్లలోకి వచ్చే ఫస్ట్ సినిమాగా 'ఇష్క్' అవుతుంది.

ఆర్.బి.చౌదరి సమర్పిస్తున్న 'ఇష్క్' చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ - పారస్ జైన్ - వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ రొమాంటిక్ థ్రిల్లర్ నుంచి విడుదలైన ట్రైలర్ మరియు ప్రోమోలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా.. వరప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.