టీజర్ టాక్: ఉత్కంఠ రేకెత్తించే మెగాస్టార్ క్రైమ్ థ్రిల్లర్

Sun Feb 28 2021 10:58:20 GMT+0530 (IST)

Teaser Talk: A thrilling megastar crime thriller

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. సీటు అంచున కూచుని చూసేంత ఎగ్జయిట్ మెంట్ ని థియేటర్లలో ఇవ్వగలిగితే అలాంటి సినిమాలు హిట్టేనని ప్రూవైంది. తాజాగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ `ది ప్రీస్ట్` ఆ కేటగిరీకే చెందుతుందని అర్థమవుతోంది.ఇప్పటికే రిలీజ్ చేసిన తొలి టీజర్ ఆకట్టుకుంది. తాజాగా రెండో టీజర్ ని రిలీజ్ చేశారు. ఒకే ఇంట్లో మూడు హత్యలు ఆ మూడింటికి సారూప్యత.. ఈ మిస్టరీ వెనక షాడో మ్యాన్ ఎవరు?  ఇంతకీ బెన్ డిక్ట్ అనే ప్రీస్ట్ ప్రమేయం ఎంతవరకూ ఉంది ఈ హత్యల వెనక? అనేది మిస్టరీ. ఇంతకీ ఈ మిస్టరీని ఛేదించారా లేదా? అన్నది తెరపై చూపిస్తున్నారు. సంథింగ్ ఇన్ విజుబుల్ .. ఏదో కనిపించని అదృశ్య శక్తి ఈ హత్యల్ని చేసిందా?  అన్న ఉత్కంఠ కలిగించే స్క్రీన్ ప్లే మ్యాజిక్ టీజర్ లో వర్కవుటైంది. అయితే సినిమా ఆద్యంతం థ్రిల్ కి గురి చేయగలిగితే హిట్టు కొట్టినట్టే.

ప్రీస్ట్ టీజర్ 2 లో మమ్ముట్టి పాత్ర ఫాదర్ బెనెడిక్ట్ మాజీ ప్రీస్ట్.. నేర పరిశోధనలపై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్న ప్రీస్ట్ అతడు. 1.07 నిమిషాల నిడివిగల టీజర్ ఆద్యంతం రక్తి కట్టించింది. మమ్ముట్టి నాలుగు దశాబ్దాల నటనా జీవితంలో మొదటి పూజారిసారి చర్చి ఫాదర్ గా నటించారు. ఈ చిత్రంలో మంజు వారియర్ కీలక పాత్రను పోషించారు. బేబీ మోనికా- నిఖిలా విమల్- సానియా ఇయప్పన్ నటిస్తున్నారు.

జోఫిన్ టి చాకో ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి కుంజీరాయణం ఫేమ్ దీపు ప్రదీప్- కాక్టెయిల్ ఫేమ్ శ్యామ్ మీనన్ స్క్రిప్ట్ ఇచ్చారు. రాహుల్ రాజ్ పాటలతో పాటు ఒరిజినల్ స్కోర్ కంపోజ్ చేశారు. అఖిల్ జార్జ్ ఫోటోగ్రఫీ అందించారు. ఆంటో జోసెఫ్- విఎన్ బాబు సంయుక్తంగా నిర్మించారు.