టీజర్ టాక్: ఇక వేటే.. అంటున్న నందమూరి సింహం

Thu Nov 21 2019 17:52:46 GMT+0530 (IST)

Teaser Taik: Roaring Ruler

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రూలర్'.  ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్.. వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.  డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితం విడుదలయింది. టీజర్ ఆరంభంలోనే "ధర్మ మా ఊరి గ్రామదైవం.. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనే ముందుంటాడు"అంటూ బాలయ్య గురించి ఓ భారీ ఇంట్రో ఇస్తారు.  ఇక బాలయ్య తనదైన శైలిలో రౌడీలను తుక్కు రేగ్గొడుతూ.. ఫుల్ యాక్షన్ మూడ్ లో ఉంటారు.  బాలయ్య సినిమా టీజర్ అంటే ఒక పవర్ఫుల్ పంచ్ ఉండాలి కదా.. "ఒంటి మీద ఖాకి యూనిఫాం ఉంటేనే బోన్లో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా.. బైటకొచ్చిన సింహంలా ఆగను..ఇక వేటే" అంటూ చిటికెలు వేస్తూ పోలీసు యూనిఫాంలో ఉన్న బాలయ్య గర్జిస్తారు.

టీజర్ ఎలా ఉంది అంటే టిపికల్ బాలయ్య ఫిలిం అనిపిస్తోంది.  బాలయ్య అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఉన్నాయి. ఇంటెన్స్ సీన్స్.. ఫైట్లు.. రొమాన్స్.. కామెడీ.. ఇలా అన్నీ అంశాలతో తెరకెక్కించిన సినిమాలా ఉంది. ప్రొడక్షన్ రిచ్ గా కనిపిస్తోంది.  ఇక తారాగణం కూడా భారీగానే ఉంది.  అటు ప్రకాష్ రాజ్.. భూమిక నుంచి ఇటు ధన్ రాజ్ వరకూ చాలామంది నటీనటులు ఉన్నారు. సినిమా స్టొరీ.. థీమ్ ఏంటి అన్నది రివీల్ చెయ్యలేదు కాబట్టి ట్రైలర్ వస్తే కానీ సినిమా ఎలా ఉంటుందో అనే అంచనాకు రాలేం.  బాలయ్య రెండు గెటప్ లు చూపించారు కానీ ఎక్కువ వివరాలు టీజర్ లో వెల్లడించలేదు. టీజర్ వరకూ చూస్తే మాత్రం దబిడి దిబిడే..!