Begin typing your search above and press return to search.

నితిన్‌ టైం అస్సలు వృదా కానివ్వడం లేదు

By:  Tupaki Desk   |   18 Oct 2020 11:30 PM GMT
నితిన్‌ టైం అస్సలు వృదా కానివ్వడం లేదు
X
కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా దాదాపు ఆరు నెలల పాటు నితిన్‌ షూటింగ్‌ లకు పూర్తిగా దూరంగా ఉన్నాడు. కేవలం నితిన్‌ మాత్రమే కాకుండా సినిమా పరిశ్రమ దాదాపు 90 శాతం ఆరు నెలలుగా షూటింగ్‌ లకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు గత నెల నుండి షూటింగ్స్‌ కు రెడీ అయ్యారు. నితిన్‌ ఆరు నెలలు వచ్చిన గ్యాప్‌ ను కవర్‌ చేసేందుకు ఇకపై అస్సలు టైం వృదా చేయవద్దని భావిస్తున్నాడు అనిపిస్తుంది. అందుకే ఇటీవలే రంగ్‌ దే సినిమా హైదరాబాద్‌ షెడ్యూల్‌ ను పూర్తి చేసిన నితిన్‌ మరో వైపు ఒక కమర్షియల్‌ యాడ్‌ షూట్‌ లో పాల్గొన్నాడు. రంగ్‌ దే షెడ్యూల్‌ పూర్తి అయిన వెంటనే చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో 'చెక్‌' సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యాడు.

రంగ్‌ దే హైదరాబాద్‌ షెడ్యూల్ ముగించుకుని రెండు వారాల తర్వాత ఇటలీ వెళ్లాలి అనుకున్నారు. ఆ గ్యాప్‌ లో ఖాళీ ఎందుకు ఉండటం అనుకున్నాడో ఏమో కాని రెండు వారాల పాటు చెక్‌ మూవీ షూటింగ్‌ లో పాల్గొన్నాడు. ఈనెల 25 నుండి మళ్లీ రంగ్‌ దే సినిమా షూటింగ్‌ లో ఆయన జాయిన్‌ కాబోతున్నాడు. ఈసారి ఆ సినిమా షూటింగ్‌ కోసం యూనిట్‌ సభ్యులు ఇటలీ వెళ్లబోతున్నారు. దాదాపు నాలుగు వారాల పాటు అక్కడ చిత్రీకరణ జరిపనున్నారు. దాంతో షూటింగ్‌ దాదాపుగా పూర్తి అవుతుందని అంటున్నారు.

ఇటలీ నుండి వచ్చిన వెంటనే వారం లేదా పది రోజుల గ్యాప్‌ లోమళ్లీ చెక్‌ సినిమా తదుపరి షెడ్యూల్‌ ప్లాన్‌ చేయబోతున్నారు. చెక్‌ సినిమా షూటింగ్‌ జరుగుతూ ఉండగానే బాలీవుడ్‌ అంధాదున్‌ రీమేక్‌ షూటింగ్‌ కూడా ప్రారంభించబోతున్నారు. మొత్తానికి నితిన్‌ ఆరు నెలలు వృదా అయినందుకు ఇకపై ఆరు రోజులు కూడా వృదా చేయకుండా వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నట్లుగా ఉన్నాడు. నితిన్‌ జోరు చూస్తుంటే వచ్చే ఏడాది ఏకంగా మూడు సినిమాలతో మనోడు కుమ్మేసేలా ఉన్నాడు కదా అనిపిస్తుంది. ఈ మూడు సినిమాల తర్వాత పవర్‌ పేట సినిమాను కూడా నితిన్‌ చేసేందుకు క్యూలో ఉంచాడు.