Begin typing your search above and press return to search.

తౌబా సింగిల్ : బాద్ షా జిమ్మిక్.. మాళ‌విక గ్లామ‌ర్ కిక్

By:  Tupaki Desk   |   26 Jun 2022 3:30 AM GMT
తౌబా సింగిల్ : బాద్ షా జిమ్మిక్.. మాళ‌విక గ్లామ‌ర్ కిక్
X
గ‌త కొంత‌కాలంగా `తౌబా..` అంటూ హ‌డావుడి ఒక రేంజులో సాగుతోంది. మాస్ట‌ర్ ఫేం మాళ‌విక మోహ‌న‌న్ తొలిసారి ఒక సింగిల్ ఆల్బ‌మ్ లో క‌నిపిస్తుండ‌డంతో అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. బాద్ షా లాంటి ట్యాలెంటెడ్ సింగ‌ర్ కం మ్యూజిక్ డైరెక్ట‌ర్ తో క‌లిసి మాళ‌విక ఈ ప్ర‌యోగం చేసింది.

తాజాగా తౌబా సింగిల్ సాంగ్ విడుద‌లైంది. సాంగ్ ఆద్యంతం ర్యాప‌ర్ బాద్ షా జిమ్మిక్.. మాళ‌విక గ్లామ‌ర్ కిక్ ఒక రేంజులో క్లిక్క‌య్యాయ‌నే చెప్పాలి. ముఖ్యంగా తౌబా పాట‌లో క్లాసికల్ మ్యూజిక్ థీమ్ కి త‌గ్గ‌ట్టు కొరియోగ్ర‌ఫీ అంతే క్లాసీగా డిజైన్ చేయ‌డం కిక్కిచ్చింద‌నే చెప్పాలి.

ఇక ఈ సాంగ్ ఆద్యంతం బాద్ షా ర‌క‌ర‌కాల గెట‌ప్పులు కాస్ట్యూమ్స్ లో స్పెష‌ల్ గా క‌నిపించారు. మాంత్రికుడి గెట‌ప్ లోనూ అత‌డి సాలిడ్ ఎక్స్ ప్రెష‌న్స్ ఆక‌ట్టుకున్నాయి. అయితే బాద్ షా ముందు వేషాలు మార్చ‌డంలో మాళ‌విక చాలా పూర్ గా క‌నిపించింది. కేవ‌లం రెండే రెండు కాస్ట్యూమ్స్ లో మాత్ర‌మే మాళ‌విక క‌నిపించింది. ఇటీవ‌ల విడుద‌లైన నోరా ఫ‌తేహి సింగిల్ `డ‌ర్టీ లిటిల్ సీక్రెట్` ఆల్బ‌మ్ తో పోలిస్తే ఇది రొటీన్ గా అనిపిస్తుంది.

నోరా ఫ‌తేహి కొరియోగ్ర‌ఫీ కాస్ట్యూమ్ సెన్స్ ముందు మాళ‌విక కోసం అంత కేరింగ్ క‌నిపించ‌లేదు. ఇక మాళ‌విక లాంటి గ్లామ‌ర్ క్వీన్ నుంచి హ‌ద్దులు చెరిపేసిన డ‌ర్టీ మూవ్స్ ని ఆశిస్తారు అభిమానులు. కానీ అందుకు భిన్నంగా మాళ‌విక క్లాసీగా క‌నిపించింది.

ఓవ‌రాల్ గా సాంగ్ క్లాస్ అప్పీల్ తో క‌నిపిస్తుంది. తౌబా సాంగ్ లిరిక్స్ ను బాద్షా-పాయల్ దేవ్ రాశారు. దీనికి ఆదిత్య దేవ్ సంగీతం అందించారు. ఈ సరికొత్త మ్యూజిక్ వీడియోకు పునీత్ .జె దర్శకత్వం వహించారు. బాద్ షా - పాయల్ దేవ్ ఆల‌పించ‌గా.. పాట‌లో బాద్ షా - మాళ‌విక‌తో పాటు పాయ‌ల్ దేవ్ కూడా మెరుపులా మెరిసారు.

సినిమాలు త‌గ్గుతున్న క్ర‌మంలో మాళ‌విక ఇటీవ‌ల ఇలాంటి ప్ర‌యోగాలు చేస్తోంది. ఈపాటికే టాలీవుడ్ లో అడుగు పెట్టాల్సిన ఈ భామ‌కు ఆ ఘ‌డియ ఇంకా రాలేదు. త‌దుప‌రి టాలీవుడ్ లో ఓ అగ్ర‌హీరో స‌ర‌స‌న న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నా ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.