నాటికోడి ఇగురు.. చిల్లు గారెల రుచులు

Sat Nov 27 2021 21:00:01 GMT+0530 (IST)

Tarak said with the contestant on show

మొన్నటివరకూ ప్రభాస్ విందు అభిరుచిపై నెటిజనుల్లో డిబేట్ రన్ అయ్యింది. ఇప్పుడు యంగ్ యమ ఎన్టీఆర్ అభిరుచి గురించి చర్చ మొదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రభాస్ లానే మంచి నాన్ వెజిటేరియన్ ప్రియుడు. అందులోనూ తన తల్లి నాన్ వెజ్ ఐటమ్స్ తయారు చేసారంటే? ఎవరైనా వావ్ అనాల్సిందేనని ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు.చిన్న నాటి నుంచి తారక్ నాన్ వెజ్ కే ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తూ వచ్చారు. ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నంతగా అడిక్టెడ్. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు పూర్తిగా వెజిటేరియన్ గామారిపోయానని `ఎవరు మీలో కోటీశ్వరుడు` షోలో కంటెంస్టెంట్ తో తారక్ చెప్పుకొచ్చారు.

కెరీర్ పరంగా నాన్ వెజ్ తనకు అడ్డంకి అయ్యిందట. బరువు పెరిగిపోవడం...బాడీలో కొలెస్టరాల్ వేగంగా పెరిగిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు చోటు చేసుకోవడంతో కొన్నాళ్లుగా నాన్ వెజ్ కి దూరంగా ఉంటున్నారుట. స్లిమ్ గా గా ఫిట్ గా కనిపించడం కోసం మాంసాహారాలు అన్నింటిని వదిలేయాల్సి వచ్చిందని చెప్పకనే చెప్పారు.

ఈ షోలో ఆసక్తికర డిస్కషన్ సాగింది. పోటీదారుడు తన తల్లి నాన్ వెజ్ టేరియన్ చాలా బాగా చేస్తారని పేర్కొన్నాడు. దీంతో వెంటనే తారక్ నోట్లో నీరూరినంత పనైంది. వెంటనే తారక్ నాటుకోడి చిల్లుగారి తింటే మాములుగా ఉండదనేసారు. సినిమాల కోసం రుచిరమైన ఆహారాన్ని వదులకోవాల్సి వచ్చిందన్నారు.

దీంతో లైవ్ లో షో చూస్తున్న వారంతా తెగ నవ్వారు. ఇక `ఎవరు మీలో కోటీశ్వరుడు` షో డిసెంబర్ మొదటివారంతో పూర్తవుతుంది. అనంతరం ఎన్టీఆర్ ఫ్రీ అవుతారు. అటుపై `ఆర్.ఆర్.ఆర్` ప్రమోషన్ లో బిజీ అవుతారు.

వరల్డ్ వైడ్ గా `ఆర్ ఆర్ ఆర్` డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అనంతరం తారక్ తన 30వ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. కేజీఎప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తోనూ కథా చర్చలు సాగుతున్నాయి.