తారా దెబ్బకు భగభగ మండుతున్న ఇన్ స్టా!

Sat Jul 24 2021 12:20:57 GMT+0530 (IST)

Tara sutaria shared latest pic on Instagram

కరణ్ జోహార్ నిర్మించిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` చిత్రంతో కథానాయికగా ఆరంగేట్రం చేసిన తారా సుతారియా ఆ తర్వాత కెరీర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. ఈ అమ్మడి అందచందాలు ప్రతిభకు యువతరం ఫిదా అయిపోయింది. తారాకు సోషల్ మీడియాల్లోనూ అసాధారణ ఫాలోయింగ్ ఉంది.తారా ఇటీవల హీరోపంతి- 3 చిత్రీకరణ ప్రారంభించినప్పుడు ఉత్సాహంగా కనిపించింది. ఇటీవల ఒక సెల్ఫీని తారా పోస్ట్ చేసింది. ఈసారి స్పెషల్ బికినీ షూట్ తో కుర్రాళ్ల గుండెల్ని షూటౌట్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఇన్ స్టా క్లిక్ లు లైక్ లతో భగభగ మండుతోంది.

తారా వెట్ టోన్డ్ బాడీ లుక్ కి యూత్ స్పెల్ బౌండ్ అయిపోతున్నారు. అలా బికినీ అందాలను ఆరబోస్తూ డెనిమ్ ని జారవిడిచిన ఈ అమ్మడి లుక్ హీట్ పెంచుతోంది. ముఖ్యంగా తారా టోన్డ్ యాబ్స్ మతి చెడే ట్రీటిస్తున్నాయనే చెప్పాలి. హాట్ ఫర్ యు డియర్ అన్న క్యాప్షన్ తో టీజ్ చేసింది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. హీరోపంథి 3 చిత్రీకరణను ఇటీవలే ప్రారంభించింది. ఇది కాకుండా అర్జున్ కపూర్ - దిషా పటానిలతో కలిసి ఏక్ విలన్ 2 లో కూడా నటించనుంది.

తారా స్నేహితుడి శుభాకాంక్షలు

ఇటీవలే తారా తన చెలికాడు ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ 26వ పుట్టినరోజు జరుపుకోగా.. స్వీట్ నోట్ తో శుభాకాంక్షలు తెలిపింది. తారా సుతారియా.. అర్మాన్ మాలిక్ చిన్ననాటి స్నేహితులు. తరచుగా సోషల్ మీడియాలో ఒకరినొకరు ప్రశంసిస్తూ హాట్ టాపిక్ గా మారుతుంటారు. ఇంతకుముందు అర్మాన్ మాలిక్ పుట్టినరోజు గుర్తుగా తారా అతనితో కలిసి ఉన్న ఒక ఫోటోను పంచుకుంది. అర్మాన్ మాలిక్ ఈ రోజు జూలై 22 న 26 ఏళ్ళు అంటూ వెల్లడించింది. తారా సుతారియా తన తదుపరి చిత్రం ఏక్ విలన్ రిటర్న్స్ రెండవ షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది. కానీ ఇది తన ప్రత్యేక రోజున సన్నిహితుడు అర్మాన్ మాలిక్ మీద ప్రేమను దాచకుండా ఆగలేకపోయింది. ఈ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలో తారా అతడిని వెనుక నుండి కౌగిలించుకుని కనిపించింది.

ALT బాలాజీ రొమాంటిక్ డ్రామా `బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3` కోసం అర్మాన్ మాలిక్ .. అతని సోదరుడు అమాల్ మల్లిక్ `క్యా కియా హై` ట్యూన్ ని ఆలపించగా అది పెద్ద హిట్ అయ్యింది. ఇది అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ట్రెండింగ్‌లో ఉంది. అక్టోబర్.. M.S. వంటి చిత్రాలలో పాటలను ఆలపించిన అర్మాన్ ప్రశంసలు అందుకున్నాడు. ధోని ది అన్ టోల్డ్ స్టోరీ.. 102 నాట్ అవుట్ .. బజార్.. సంజు.. హీరో .. కబీర్ సింగ్ చిత్రాలకు ఆలపించాడు. ఆర్మాన్ తదుపరి హీరోగానూ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహకాల్లో ఉన్నారని కూడా బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.