ఫోటో స్టోరి: చూపులతో గుచ్చి గుచ్చి సంపకూ..!

Wed Sep 30 2020 06:00:01 GMT+0530 (IST)

Photo Story: Killing with eyes ..!

నటవారసులపై నిరంతరం ఏదో ఒక టాపిక్ వినిపిస్తూనే ఉంది. కంగన లాంటి భామలు నిత్యం నెప్లోయిజంపై చెలరేగుతూనే ఉన్నారు. ఇక కరణ్ జోహార్ ఇంట్రడ్యూస్ చేసిన తారా సుతారియా పైనా ఆ ప్రభావం అంతో ఇంతో ఉంది మరి. ఇప్పటికే తన కొలీగ్ అనన్య పాండే కి ఈ సెగ ఓ రేంజులోనే తాకింది. ఆ ఇద్దరూ కలిసి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అనే చిత్రంతో తెరకు పరిచయమైన సంగతి విధితమే.ఇక తారా.. అనన్య తారా తీరంలో ఓ రేంజులోనే దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో యువతరం కలల రాణులుగా వెలిగిపోతున్నారు. ఇక తారా సుతారియా అందచందాలకు ఫిదా కాని వాళ్లు లేనే లేరు. ఇక తారా సుతారియా 7ఏళ్ల వయసులోనే సింగర్ గా రాణించింది. అటుపై బాలనటిగా టీవీ నటిగా కెరీర్ ప్రారంభించి సినీతారగా బరిలో దిగింది. సుతారియా ఫ్యామిలీ నుంచి వచ్చిన ట్యాలెంటెడ్ గాళ్ గా పాపులరైంది. తారా సుతారియా శిక్షణ పొందిన నృత్య కళాకారిణి. సంగీత విద్వాంసురాలు. మంచి చిత్రకారిణి కూడా. పియానో వాయించడం .. కొత్త పాటలు కంపోజ్ చేయడం నుండి బొగ్గు పెయింటింగ్..ఇలా అన్నిటా విధ్వాంసురాలు.

అయితే ఇన్ని కళలు ఉన్న తారాకి కెరీర్ పరంగా ఏ ఢోఖా లేదు. అలాగే మ్యాగజైన్ ఫోటోషూట్లతోనూ తారా దూసుకుపోతోంది. తాజాగా కాస్మోపాలిటన్ కవర్ పేజీపై పసుపు రంగు డిజైనర్ సూట్ లో దర్శనమిచ్చింది. బటన్ లెస్ టాప్ తో దుమారమే రేపింది. ఇక ఆ కంటికి కాఫీ కలర్ గాగుల్స్ జారిపోతుంటే చూపులతోనే గుచ్చి గుచ్చి చంపేస్తోంది మరి. చక్కనమ్మ అలా నూడిల్స్ తింటూ చిచ్చు పెట్టేస్తోంది. ప్రస్తుతం సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి సరసన ఈ అమ్మడు తడప్ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.