Begin typing your search above and press return to search.

పాయ‌ల్ కి సారీ చెప్పిన తారా సుతారియా

By:  Tupaki Desk   |   4 Dec 2021 1:30 PM GMT
పాయ‌ల్ కి సారీ చెప్పిన తారా సుతారియా
X
టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `ఆర్.ఎక్స్-100` బాలీవుడ్ లో `త‌డ‌ప్` టైటిల్ తో రీమేకై ఈ శుక్ర‌వారం విడుద‌లైన‌ సంగ‌తి తెలిసిందే. కార్తికేయ పోషించిన పాత్ర‌తో సునీల్ శెట్టి త‌న‌యుడు ఆహాన్ శెట్టి హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇక పాయ‌ల్ రాజ్ పుత్ పోషించిన పాత్ర‌లో తారా సుతారియా న‌టించింది.

ల‌వ్ క‌మ్ రొమాన్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమాపై బాలీవుడ్ లోనూ మంచి అంచ‌నాలేర్ప‌డ్డాయి. మాతృక వెర్ష‌న్ ని మించి బాలీవుడ్ అభిరుచికి త‌గ్గ‌ట్టు రొమాన్స్ మ‌రింత పీక్స్ లో వ‌ర్క‌వుట‌వుతుంద‌ని యువ‌త‌రం భావించారు. అయితే `త‌డ‌ప్` లో కూడా న‌టించే ఛాన్స్ పాయ‌ల్ రాజ్ పుత్ కే ద‌క్కి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

`అఫ్ కోర్స్... `త‌డ‌ప్` లో నటించే ఛాన్స్ వ‌చ్చి ఉంటే బాగుండేది. కానీ నా స్థానంలో తారా సుతారియాని ఎంపిక చేసుకోవ‌డం అనేది ద‌ర్శ‌క‌.. నిర్మాత‌ల‌పైనే ఆధార‌ప‌డింది. అందుకు నేనేమీ ఫీల్ అవ్వ‌లేదు... అని పాయ‌ల్ అంది. `త‌డ‌ప్` మంచి న‌టీన‌టులతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందని తెలిపింది.

తాజాగా `త‌డ‌ప్` రిలీజ్ డే ప్ర‌మోష‌న్ లో తారా సుతారియా కూడా పాయ‌ల్ వ్యాఖ్య‌ల‌పై స్పందించింది. పాత్ర ఎంపిక రేసులో ఇద్ద‌రు ఉన్నాం. కానీ ర‌మీసా పాత్ర‌ను ద‌ర్శ‌కులు నాకు అప్ప‌గించారు. అందుకు నేను చాలా ల‌క్కీ. అయితే ఆర్.ఎక్స్ -100 లో పాయ‌ల్ ఎలా న‌టించిందో బాగా స్ట‌డీ చేసాను. ఆ పాత్ర‌ను చాలా అనుక‌రించి త‌డ‌ప్ లో న‌టించాను.. అని తెలిపారు.

ఇది నిజంగా నాకెంతో ప్ర‌త్యేక‌మైన రోల్ గా నిలుస్తుంది. అవ‌కాశం క‌ల్పించిన సాజిద్ ..మిలింద్ స‌ర్ కి కృత‌జ్ఞ‌త‌లు... సారీ పాయ‌ల్ అంటూ న‌వ్వేసింది తారా. మొత్తానికి పాయ‌ల్ ద‌క్కించుకోవాల్సిన ఛాన్స్ ని తారా సుతారియా చేజిక్కించుకుని వార్త‌ల్లో నిలిచింది. త‌డ‌ప్ లో పాయ‌ల్ ని మించి రొమాన్స్ ని పండించిన తారాకు మంచి మార్కులే వేసారు మీడియా జ‌నం.

త‌డ‌ప్ ఈనెల 3న విడుదలైంది. పాత బాటిల్ లో కొత్త సారా పోసినా కానీ సునీల్ శెట్టి వార‌సుడు డెబ్యూ హీరో అహ‌న్ శెట్టి న‌ట‌న బావుంద‌ని.. తారా ఘాటైన న‌ట‌న హీటెక్కించింద‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి.