బాలీవుడ్ ఆరెక్స్ 100కు అంతా రెడీ

Tue Mar 26 2019 17:28:57 GMT+0530 (IST)

Tara Sutaria And Debutant Ahan Shetty In RX 100 Remake

గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన ఆరెక్స్ 100 బాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే తమిళ్ లో ఆది పినిశెట్టి హీరోగా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. సల్మాన్ ఖాన్ కన్నా ముందు కండల వీరుడిగా పేరున్న సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టిని పరిచయం చేస్తూ నడియాడ్ వాలా గ్రాండ్ సన్ సంస్థ హిందిలో భారీగా నిర్మించబోతోంది.తెలుగులో కేవలం మూడు కోట్లలోపే పూర్తయిన ఈ సినిమాను అక్కడ గ్రాండ్ స్కేల్ మీద చాలా లొకేషన్స్ లో షూట్ చేయబోతున్నారు. అహన్ కు జోడిగా తారా సుతారియాని ఎంపిక చేశారు. ఇవాళ అధికారికంగా కన్ఫర్మ్ చేస్తూ నిర్మాణ సంస్థ నుంచి ప్రకటన వచ్చింది. కథలో కొన్ని కీలక మార్పులు చేస్తున్నామని అసలు ట్విస్ట్ లో ఎలాంటి చేంజ్ ఉండదని క్లారిటీ ఇచ్చారు

దీనికి దర్శకత్వం మిలన్ లుత్రియా. విద్యా బాలన్ తో డర్టీ పిక్చర్ ద్వారా పేరు తెచ్చుకున్న ఇతను మళ్ళీ ఈ ఆరెక్స్ 100 రీమేక్ తో అంతకు మించిన మేజిక్ చేస్తాను అంటున్నాడు. కానీ టైటిల్ మాత్రం ఆరెక్స్ 100 ఉండదని తెలిసింది. ఇప్పటికే ఆరెక్స్ 100 హిందీ డబ్బింగ్ వెర్షన్ యుట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. 13 మిలియన్ల వ్యూస్ తో నార్త్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. అందుకే పేరు మార్చే ఆలోచనలో ఉన్నారు టీమ్ మెంబెర్స్. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టుకోనున్న ఆరెక్స్ 100 ఒరిజినల్ ఫీల్ ని మిస్ కాకుండా హిందీలో ఎలా తెరకెక్కిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది